News December 5, 2024
జగన్ మరో నాటకానికి సిద్దమౌతున్నారు: బాలాజీ

అసెంబ్లీకి వెళ్లకుండా వీధి నాటకాలు ఆడిన వైసీపీ అధినేత జగన్ మరో నాటకానికి సిద్దమౌతున్నారని జనసేన సెంట్రల్ ఆంధ్ర కో-కన్వీనర్ బాలాజి అన్నారు. గురువారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ.. జగన్ ప్రజల పక్షాన కూటమి ప్రభుత్వంపై పోరాటం చేయడానికి సిద్దమౌతున్నట్లు ప్రకటించారని, దీని ద్వారా కూటమి ప్రభుత్వంపై బురదజల్లుడు కార్యక్రమాన్ని కొనసాగించనున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Similar News
News December 13, 2025
నేడు తుళ్లూరులో ఎంపీ పెమ్మసాని పర్యటన

తుళ్లూరు మండలంలో శనివారం కేంద్ర సహాయ మంత్రి, ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు రాయపూడిలోని CRDA ప్రధాన కార్యాలయంలో అమరావతి అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు తుళ్లూరులోని మేరీమాత స్కూల్లో “నయీ చేతన” కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన వ్యక్తిగత సిబ్బంది తెలిపారు.
News December 12, 2025
కాకుమాను: సివిల్ సప్లైస్ డైరెక్టర్గా నక్కల ఆగస్టీన్

కాకుమాను మండలం కొమ్మూరు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత నక్కల ఆగస్టీన్ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అవకాశం కల్పించినందుకు సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులకు ఆగస్టీన్ ధన్యవాదాలు తెలిపారు. ఆగస్టీన్ నియామకంపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.
News December 12, 2025
గుంటూరు: వైసీపీ మీడియా ప్యానలిస్టులు వీరే.!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఆ పార్టీ నూతన మీడియా ప్యానలిస్టులను నియమించింది. గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు నేతలకు ఈ జాబితాలో అవకాశం దక్కింది. ఆవుతు శ్రీధర్, షేక్ మహబూబ్ షరీఫ్ను హిందీ ఛానెల్స్ ప్యానలిస్ట్గా నియమించారు. వీరు పార్టీ తరఫున మీడియాలో వాణి వినిపించనున్నారు.


