News July 4, 2024
జగన్ మళ్లీ జైలుకు వెళ్లే సమయం ఆసన్నమైంది: రాంప్రసాద్ రెడ్డి

జగన్ మళ్లీ జైలుకు వెళ్లే సమయం ఆసన్నమైందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. 21 రోజుల్లోనే చంద్రబాబు ఏమీ చేయలేదని జగన్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ నేతలపై కక్ష సాధించే ఆలోచన టీడీపీకి లేదన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చరిత్ర అందరికీ తెలిసిందే, ఐదేళ్లలో మాచర్లలో నరమేధం సృష్టించారని ఆరోపించారు.
Similar News
News November 30, 2025
వేంపల్లె: 10 రోజుల్లో డెలివరీ.. అంతలోనే విషాదం.!

ఎన్నో ఆశలు.. ఆవిరైపోయాయి. మరో 10 రోజుల్లో కుటుంబంలోకి ఇంకొకరు చేరుతారని కలలుకన్నారు. కానీ ఆ కలల కన్నీళ్లను మిగిల్చాయి. ఈ విషాదకర ఘటన వేంపల్లిలోని పుల్లయ్య తోటలో చోటు చేసుకుంది. భూదేవి(27) అనే గర్భిణీ తన ఇంటి రెండో అంతస్తులో నుంచి కింద పడి మృతిచెందింది. అదే సమయంలో గర్భంలోని శిశువు కూడా మృతి చెందింది. దీంతో ఆ కుటుంబమే కాదు.. గ్రామస్థులు, ఈ విషయం విన్న ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమవుతున్నారు.
News November 30, 2025
కడప జిల్లాలోని విద్యాసంస్థలకు రేపు సెలవు

తుఫాను నేపథ్యంలో కడప జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు, అంగన్వాడీ సెంటర్లకు సోమవారం సెలవు ప్రకటించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఈవో శంషుద్దీన్ వెల్లడించారు. విద్యార్థులు కుంటలు, కాలువలు, చెరువులు, పాడుబడ్డ గోడల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు.
News November 30, 2025
కడప: తుఫాన్ ఎఫెక్ట్.. కంట్రోల్ రూములు ఏర్పాటు చేసిన విద్యుత్ శాఖ

జిల్లాలో తుపాన్ దృష్ట్యా ప్రమాదాలపై కడప జిల్లాలో 5 కంట్రోల్ రూములు ఏర్పాటు చేసినట్లు విద్యుత్ శాఖ SE రమణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
కడప జిల్లా కార్యాలయం: 9440817440
కడప డివిజన్: 9440817441
పులివెందుల డివిజన్: 9491431255
ప్రొద్దుటూరు డివిజన్: 7893261958
మైదుకూరు డివిజన్: 9492873325లను సంప్రదించాలని తెలిపారు. విద్యుత్ ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


