News June 5, 2024
జగన్ రికార్డును బ్రేక్ చేసిన రఘువీర్ రెడ్డి

భారీ మెజార్టీతో గెలిచిన రఘువీర్ గతంలో జగన్ సాధించిన రికార్డును బద్దలు కొట్టారు. 2011లో కడప MP స్థానానికి జరిగిన బై పోల్‌లో జగన్ మెజార్టీ 5,45,672. ఆ రికార్డును తిరగరాస్తూ రఘువీర్ 5,59,905 లక్షల మెజార్టీ సాధించారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక మెజార్టీ మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహరావు పేరిట ఉంది. 1991లో నంద్యాల స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన 5.8 లక్షల పైచిలుకు ఓట్లు సాధించారు.
Similar News
News November 15, 2025
NLG: ఉపాధ్యాయుల్లో ‘టెట్’ టెన్షన్!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉపాధ్యాయులకు టెట్ టెన్షన్ పెరిగింది. పీఈటీలు, పీడీలు మినహా ఇతర ఉపాధ్యాయులంతా రెండేళ్లలో టెట్ అర్హత సాధించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఇన్ సర్వీసు టీచర్లలో ఆందోళన నెలకొంది. పదోన్నతులు, ఉద్యోగ భద్రతపై అనిశ్చితి వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాలో సుమారు 5 వేల మందికి టెట్ తప్పనిసరి కావడంతో ఉపాధ్యాయ సంఘాలు మినహాయింపు కోసం ఎన్సీటీఈ, ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
News November 15, 2025
NLG: కుటుంబానికి ఒక్కటే.. అదీ అందడం లేదు!

జిల్లాలో రేషన్ లబ్ధిదారులకు డీలర్లు సంచులు పంపిణీ చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. రేషన్ షాపుల పంపిణీ చేస్తున్న సన్న బియ్యాన్ని సంచుల్లో ఇవ్వాల్సి ఉండగా చాలా గ్రామాలలో లబ్ధిదారులకు అవి పూర్తిస్థాయిలో అందడం లేదు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఇక్కడ రేషన్ ఇస్తున్నా సంచులు ఇవ్వడం లేదు. అదే విధంగా 6 కిలోలకు ఒక సంచి చొప్పున ఇవ్వాల్సి ఉండగా, కుటుంబానికి ఒకటి చొప్పున డీలర్లు పంపిణీ చేస్తున్నారు.
News November 15, 2025
నాగార్జునసాగర్ ఆసుపత్రిలో చిన్నారులకు అస్వస్థత

సాగర్‌లోని కమల నెహ్రూ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 17 మంది చిన్నారులు శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. వారికి గ్లూకోజ్, ఇంజెక్షన్లు ఇచ్చాక ఒక్కసారిగా చలి, జ్వరం, వాంతులు వచ్చాయని బాధిత కుటుంబసభ్యులు తెలిపారు. వారికి ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.


