News April 10, 2025
జగన్ వ్యాఖ్యలు పోలీస్ వ్యవస్థకి మాయని మచ్చ: పుల్లారావు

పోలీస్ వ్యవస్థపై జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనమనే చెప్పాలని MLA ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ .. రాప్తాడులో జగన్ చేసిన వీరంగాన్ని యాక్షన్ సినిమా క్లైమాక్స్ను తలదన్నేలా చెప్పాలన్నారు. పోలీసుల బట్టలు ఊడదీస్తానని జగన్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంలో మామనిమచ్చగా నిలుస్తాయని అన్నారు.
Similar News
News October 16, 2025
సిద్దిపేటలో హృదయ విదారక ఘటన

సిద్దిపేట జిల్లా పుల్లూరులో హృదయ విదారక ఘటన జరిగింది. ఆయనకు ముగ్గురు పిల్లలున్నా.. ఆయన మృతదేహాన్ని ఉంచేందుకు సొంతిళ్లు లేకపోయంది. పోచయ్యకు భార్య, ఇద్దరు కొడుకులు, కుమార్తె ఉన్నారు. అద్దె ఇంట్లో ఉంటున్న పోచయ్య ఆరోగ్య క్షీణించి చనిపోయారు. పొలం విషయంలో గొడవలు జరుగుతుండగా అంత్యక్రియలకు కొడుకులు ముందుకు రాలేదు. దీంతో మృతదేహాన్ని రైతు వేదికలో ఉంచి గ్రామస్థుల సహకారంతో భార్యే అంత్యక్రియలు నిర్వహించింది.
News October 16, 2025
కర్నూలుకు బయల్దేరిన ప్రధాని మోదీ

ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వాయుసేన విమానంలో కర్నూలుకు బయలుదేరారు. కాసేపట్లో ఓర్వకల్లు వినానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం ఎంఐ-17 హెలికాప్టర్లో సుండిపెంటకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం వెళ్లి భ్రమరాంబ అమ్మవారు, మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 2.20 గంటలకు కర్నూలులో జరిగి ‘జీఎస్టీ 2.0’ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
News October 16, 2025
టీడీపీలో చేరేందుకు మాజీ ఎమ్మెల్యే కొండేటి ప్రయత్నాలు?

పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు టీడీపీలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీలో చేరి ఇన్ ఛార్జ్ పదవి దక్కించుకోవాలన్నదే ఆయన ప్లాన్ గా సమాచారం. టీడీపీ పెద్దలు చిట్టిబాబును పార్టీలోకి తీసుకువచ్చేందుకు పావులు కదుపుతుండగా.. ఆ పార్టీలోని ఎస్సీ నేతలు అడ్డుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. చిట్టిబాబు టీడీపీలో ఎంట్రీ జరిగేనా ? లేదా వేచి చూడాలి.