News April 10, 2025

జగన్ వ్యాఖ్యలు పోలీస్ వ్యవస్థకి మాయని మచ్చ: పుల్లారావు 

image

పోలీస్ వ్యవస్థపై జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనమనే చెప్పాలని MLA ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ .. రాప్తాడులో జగన్ చేసిన వీరంగాన్ని యాక్షన్ సినిమా క్లైమాక్స్‌ను తలదన్నేలా చెప్పాలన్నారు. పోలీసుల బట్టలు ఊడదీస్తానని జగన్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంలో మామనిమచ్చగా నిలుస్తాయని అన్నారు.

Similar News

News April 22, 2025

CSKకు గెలవాలనే కసి లేదు: రైనా

image

ఐపీఎల్ 2025లో సీఎస్కేకు గెలవాలనే తపన, కసి లేవని ఆ జట్టు మాజీ ప్లేయర్ సురేశ్ రైనా అన్నారు. ప్రస్తుతం అన్ని జట్లకన్నా సీఎస్కేనే బలహీనంగా కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘జట్టులోని ఆటగాళ్లకు అసలు అంకితభావం, చిత్తశుద్ధి లేనట్లుగా కనిపిస్తోంది. ఇది నేను వారిని అవమానిస్తున్నట్లు కాదు. గతంలో సీఎస్కేకు ఉండే బ్రాండ్ ఇమేజ్ ఇప్పుడు కనిపించడం లేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News April 22, 2025

గట్టు జూనియర్ కాలేజీలో మెరిసిన మాణిక్యం

image

గట్టు మండల కేంద్రంలోని ప్రభుత్వ గురుకుల జూనియర్ కాలేజీలో చదువుతున్న మహిన్ జవేరియా ఈ ఏడాది విడుదలైన ఇంటర్ ఫలితాల్లో 440లో 432 మార్కులు సాధించి ప్రతిభను చాటింది. చిన్న కిరాణా షాప్ నడుపుకుంటూ విద్యను ప్రోత్సహించిన తల్లిదండ్రుల ఆత్మీయతకు మంచి ఫలితం వచ్చిందని గ్రామస్థులు తెలిపారు. మహిన్ సాధనకు ప్రశంసలు వెల్లువెత్తాయి. గ్రామస్థులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు పంపించి అభినందనలు తెలిపారు.

News April 22, 2025

తప్పు చేసినవారిపై చర్యలు తప్పవు: సీఎం సిద్దరామయ్య

image

కర్ణాటకలో ‘వింగ్ కమాండర్‌పై దాడి’ కేసులో దోషులపై చట్టప్రకారం చర్యలు తప్పవని ఆ రాష్ట్ర CM సిద్దరామయ్య స్పష్టం చేశారు. ‘కన్నడిగులు మాతృభాష పట్ల గర్విస్తారు. అలా అని ఇతర భాషల్ని ద్వేషించరు. దాడులు చేయరు. మాది అంతటి కుంచిత మనస్తత్వం కాదు. జాతీయ మీడియా మా గౌరవాన్ని దిగజార్చేలా వార్తలు వ్యాప్తి చేయడం దురదృష్టకరం. ఘటనపై సమగ్ర విచారణ చేసి దోషుల్ని కఠినంగా శిక్షించాలని పోలీసుల్ని ఆదేశించాను’ అని తెలిపారు.

error: Content is protected !!