News June 18, 2024

జగన్ సమావేశానికి ప్రకాశం జిల్లా నేతలు

image

మాజీ సీఎం జగన్ అధ్యక్షతన ఈ నెల 22న శనివారం ఉదయం 10.30కి తాడేపల్లిలోని జగన్ క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లాలోని ఎమ్మెల్యేలతో పాటు , ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ హాజరుకానున్నారు. వీరితో పాటు ఎంపీలు మినహా పార్లమెంట్‌కు పోటీ చేసిన అభ్యర్థులను కూడా ఆహ్వానించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

Similar News

News January 18, 2026

ప్రకాశం: ఫుల్‌గా తాగేశారు..!

image

ప్రకాశం జిల్లాలో సంక్రాంతి ఘనంగా జరిగింది. పండగల్లో మద్యం ప్రియులు తమ సత్తా చూపారు. 14వ తేదీ ఒక్కరోజే రూ.5.82 కోట్ల విలువైన మద్యం గౌడౌన్ నుంచి షాపులకు తరలింది. 15, 16వ తేదీల్లో గోడౌన్లకు సెలవు కావడంతో ముందుగా మద్యం షాపుల ఓనర్లు భారీగా మద్యం తీసుకు వచ్చారు. ఈనెల పదో తేదీ నుంచి 14వ తేదీ వరకు సుమారు రూ.23 కోట్ల వ్యాపారం జరిగినట్లు అధికారుల సమాచారం.

News January 18, 2026

ఇవాళ ప్రకాశం జిల్లాకు రానున్న ఇన్‌ఛార్జ్ మంత్రి

image

ప్రకాశం జిల్లా పర్యటన నిమిత్తం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదివారం రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఒంగోలులో జరిగే నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఇదే కార్యక్రమంలో జిల్లాకు చెందిన మంత్రి స్వామి, పలువురు ఎమ్మెల్యేలు సైతం పాల్గొననున్నారు.