News June 20, 2024
జగన్ సమావేశానికి వెళ్లలేకపోయిన చెవిరెడ్డి

ఇవాళ జగన్ అధ్యక్షతన వైసీపీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. ఓడిపోయిన, గెలిచిన అభ్యర్థులతో జగన్ చర్చించనున్నారు. ఈ సమావేశానికి వెళ్లడానికి చిత్తూరు, అనంతపురం జిల్లాకు చెందిన నాయకులు బెంగళూరు నుంచి విజయవాడకు విమానం బుక్ చేసుకున్నారు. ఇవాళ ఉదయం 7.30కి బయల్దేరాల్సి ఉండగా చివరి నిమిషంలో విమానం రద్దు అయ్యింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, తదితరులు సమావేశానికి దూరమయ్యారు.
Similar News
News November 10, 2025
AP లేబర్ వెల్ఫేర్ బోర్డు డైరెక్టర్‌గా శాంతిపురం వాసి

ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ బోర్డు డైరెక్టర్‌గా శాంతిపురం టీడీపీ నేత విశ్వనాథ నాయుడు నియమితులయ్యారు. రాష్ట్రంలో మరో 10 కార్పొరేషన్లకు ప్రభుత్వం నూతన కమిటీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో లేబర్ వెల్ఫేర్ డైరెక్టర్‌గా విశ్వనాథ్‌కు అవకాశం కల్పించారు. ఆయన నియామకం పట్ల టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.
News November 10, 2025
అవినీతికి పాల్పడితే చర్యలు: కలెక్టర్

వ్యవసాయ శాఖ అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. కలెక్టరేట్‌లో జిల్లా వ్యవసాయ జేడీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని, అర్హులకు వాటిని అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఎవరన్నా అవినీతికి పాల్పడితే చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు.
News November 10, 2025
చిత్తూరు పోలీసులకు 43 ఫిర్యాదులు

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. బాధితుల నుంచి ఎస్పీ తుషార్ డూడీ వినతులు స్వీకరించారు. 43 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. చట్ట ప్రకారం వాటిని విచారించి బాధితులకు సత్వరమే న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు.


