News May 2, 2024
జగన్ సీఎం అయ్యాక నాపై దాడులు పెరిగాయి: మాజీ జడ్జి

జగన్ సీఎం అయ్యాక నాపై దాడులు జరుగుతున్నాయని మాజీ జడ్జి రామకృష్ణ అన్నారు. మదనపల్లి ప్రెస్ క్లబ్‌లో అయన మాట్లాడుతూ..ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డిపై మార్చి 25న బీ కొత్తకోట స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే సీఐ పట్టించులేదన్నారు. అందుకే నాఇంటిని ధ్వంసం చేయించారని, జడ్జి తమ్ముడే ఈదాడి చేశారని సీఐ ప్రకటన ఇవ్వడం సరికాదన్నారు. ఎలాంటి విచారణ చేయకుండా తప్పుడు దర్యాప్తు చేశారని ఆరోపించారు.
Similar News
News April 18, 2026
సదుం: రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి

రోడ్డు ప్రమాదంలో సదుం మండలానికి చెందిన బీటెక్ విద్యార్థి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. చెరుకువారి పల్లెకి చెందిన ధరణి తమిళనాడు రాష్ట్రం మధురైలో బీటెక్ చదువుతున్నాడు. గత శనివారం అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు.
News April 18, 2026
కుప్పంలో మరో భారీ పరిశ్రమకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

గుడిపల్లి (M) కుప్పిగాని పల్లి, దాసిమానిపల్లి, అంగనామాల కొత్తూరు గ్రామాల పరిధిలో 105 ఎకరాల భూమిని NPSPL స్పెషాలిటీ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ప్రభుత్వం కేటాయించింది. రూ.2550 కోట్ల పెట్టుబడితో కాథోడ్ మెటీరియల్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 400 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ తయారీ పాలసీ (2025-30) కింద ఆమోదించింది
News April 18, 2026
చిత్తూరు: ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండలు

చిత్తూరు జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం 6 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. గంగవరంలో 41.2, రొంపిచెర్లలో 41.1, శ్రీరంగరాజపురంలో 40.1, తవణంపల్లెలో 40.9, విజయపురంలో 40.5, బంగారుపాళ్యంలో 40.0, నగరి, నిండ్రలో 39.8, పులిచెర్ల, శాంతిపురంలో 39.6 డిగ్రీల టెంపరేచర్ నమోదు అయ్యింది.


