News August 27, 2024
జగన్ హయాంలో డిస్కంల కుంబకోణం: గొట్టిపాటి
YS జగన్ పాలనలో విద్యుత్ వ్యవస్థ సర్వనాశనం అయ్యిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పత్రికా ప్రకటన ద్వారా అన్నారు. జగన్ అనాలోచిత నిర్ణయాల కారణంగా డిస్కంల పనితీరు దారుణంగా పడిపోయిందని తెలిపారు. గడిచిన ఐదేళ్ల కాలంలో డిస్కంల అప్పులు అంతకంతకు పెరిగాయని ఆరోపించారు. డిస్కంల అప్పులు పేరు చెప్పి కరెంటు బిల్లులు పెంచి, జగన్ ప్రజల రక్తం తాగారని మండిపడ్డారు.
Similar News
News September 19, 2024
ప్రకాశం జిల్లా విద్యార్థులకు గమనిక
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్(ఎన్ఎంఎంఎస్) దరఖాస్తు గడువును ఈనెల 24 వరకు పొడిగించినట్లు ప్రకాశం జిల్లా డీఈవో సుభద్ర ఒక ప్రకటనలో తెలిపారు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50 పరీక్ష ఫీజు కట్టాల్సి ఉంటుందన్నారు. ఆన్‌లైన్‌లో అప్లై చేసిన తర్వాత వాటిని ప్రింట్ తీసుకుని ఈనెల 27వ తేదీలోగా డీఈవో కార్యాలయంలో సమర్పించాలన్నారు.
News September 19, 2024
ప్రకాశం జిల్లా యువకులకు గమనిక
ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ కోసం ఎందరో యువకులు ఎదురు చూస్తున్నారు. వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కడప నగరంలో నవంబర్ 10 నుంచి 15వ తేదీ వరకు ర్యాలీ నిర్వహిస్తారు. ఈ మేరకు కడప మున్సిపల్ స్టేడియంలో అభ్యర్థులను సెలక్ట్ చేస్తారు. ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లా యువకులు సైతం ఇందులో పాల్గొనవచ్చు. మరి ర్యాలీకి మీరు సిద్ధమా..?
News September 19, 2024
బూచేపల్లికి వైసీపీ జిల్లా అధ్యక్ష పదవి.?
దర్శి MLA బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి వైసీపీ ప్రకాశం జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు ప్రకాశం జిల్లా వైసీపీ పెద్దగా వ్యవహరించిన బాలినేని అనూహ్యంగా రాజీనామా ప్రకటించారు. దీంతో జిల్లా బాధ్యతలు ఎవరు చేపడతారా? అనే చర్చ కొనసాగుతోంది. వైవీ సుబ్బారెడ్డి రాష్ట్రస్థాయిలో కీలకంగా ఉండటంతో బూచేపల్లికే అధ్యక్ష పదవి వస్తుందని భావిస్తున్నారు.