News August 27, 2024
జగన్ హయాంలో డిస్కంల కుంభకోణం: గొట్టిపాటి

YS జగన్ పాలనలో విద్యుత్ వ్యవస్థ సర్వనాశనం అయ్యిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ప్రకటనలో తెలిపారు. జగన్ అనాలోచిత నిర్ణయాల కారణంగా డిస్కంల పనితీరు దారుణంగాపడిపోయిందన్నారు. గడిచిన ఐదేళ్ల కాలంలో డిస్కంల అప్పులు అంతకంతకు పెరిగాయని ఆరోపించారు. డిస్కంల అప్పులు పేరు చెప్పి కరెంటు బిల్లులు పెంచి, జగన్ ప్రజల రక్తం తాగారని మండిపడ్డారు.
Similar News
News October 28, 2025
ప్రకాశం జిల్లాలో పునరావాసాలకు 2900 మంది

తుఫాన్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 65 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 2900 మందిని తరలించినట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కలెక్టర్ మంగళవారం సాయంత్రం ఒంగోలులోని కలెక్టరేట్లో మాట్లాడుతూ.. ఒంగోలు నగరంలో 30 లోతట్టు కాలనీలను గుర్తించామని, కోస్తా మండలాల్లో 10 లోతట్టు ఆవాస ప్రాంతాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. 2 రోజులపాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News October 28, 2025
ప్రకాశం: ‘గర్భవతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి’

గర్భవతులు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ సుధా మారుతి తెలిపారు. తుఫాన్ ప్రభావం వల్ల గర్భవతులు అప్రమత్తంగా ఉండాలని, డెలివరీ తేదీకంటే ముందుగానే హాస్పిటల్లో చూపించుకోవాలని తెలిపారు. ప్రతి గర్భిణీ స్త్రీ ఆరోగ్యాన్ని అంగన్వాడీలు స్వయంగా వారి ఇంటికి వెళ్లి పరిశీలించడం జరుగుతుందన్నారు. చిన్నారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News October 28, 2025
ప్రకాశం: జాతీయ రహదారులపై రాకపోకలు నిషేధం

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలోని జాతీయ రహదారుల్లో భారీ వాహనాల రాకపోకలను రాత్రి 7 గంటల నుంచి నిలిపివేస్తున్నట్లు SP హర్షవర్ధన్ రాజు ప్రకటన విడుదల చేశారు. అలాగే జాతీయ, రాష్ట్ర రహదారుల్లో వాహనాల ప్రయాణం నిషేధించడం జరిగిందని, ప్రజా రక్షణ నిమిత్తం తీసుకున్న నిర్ణయాన్ని వాహనదారులు పాటించాలని ఎస్పీ సూచించారు.


