News April 9, 2025

జగిత్యాలకు ఆ పేరు ఎలా వచ్చిందంటే!

image

జగిత్యాలకు ఈ పేరు రావడానికి పలు రకాల కథనాలు వ్యాప్తిలో ఉన్నాయి. క్రీ.శ. 1110 నుంచి 1116 వరకు పొలాస రాజధానిగా జగ్గ దేవుడు పరిపాలించాడు. తన పరిపాలనా కాలంలో 21 యుద్ధాలు చేసి పరిసర ప్రాంతాల్లో పలు నూతన గ్రామాలను స్థాపించాడు. పొలాస దక్షిణాన 6 కి.మీ. దూరంలో జయదేవుడు అతని పేరిట జగ్గ దేవాలయం నిర్మించి ఉంటాడని, అదే జగిత్యాల స్థిరపడిందని చరిత్రకారుల కథనం. 2016లో జగిత్యాల ప్రత్యేక జిల్లాగా ఏర్పడింది.

Similar News

News October 22, 2025

NRPT: బాధితులకు నష్టపరిహారం అందించేందుకు చర్యలు చేపట్టాలి

image

ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు నష్టపరిహారం త్వరగా అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం నారాయణపేట కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఎస్పీ డాక్టర్ వినీత్‌తో కలిసి పాల్గొన్నారు. 2015 సంవత్సరంలో ఇప్పటివరకు జిల్లాలో 13 ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు కాగా, 3 కేసులు ఛార్జ్‌షిట్ దశలో ఉన్నాయన్నారు.

News October 22, 2025

NMLలో 21 పోస్టులు

image

NTPC మైనింగ్ లిమిటెడ్(NML) 21పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మైన్ సర్వేయర్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి CA/CMA, ఇంజినీరింగ్ డిగ్రీ( ఎన్విరాన్‌మెంట్), పీజీ డిప్లొమా, MSc, ఎంటెక్, డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈనెల 27 నుంచి NOV 15వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://nml.co.in

News October 22, 2025

హీరో నారా రోహిత్ పెళ్లి తేదీ ఫిక్స్.. నాలుగు రోజులు వేడుకలు!

image

టాలీవుడ్ హీరో నారా రోహిత్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. నటి, ప్రియురాలైన శిరీషను ఈనెల 30న రోహిత్ పెళ్లి చేసుకోబోతున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈనెల 25న హల్దీ వేడుకతో పెళ్లి వేడుకలు మొదలు కానున్నాయి. 26న పెళ్లి కొడుకు వేడుక, 28న మెహందీ, 30న రాత్రి 10.35 గంటలకు హైదరాబాద్‌లో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహం జరగనుంది.