News April 9, 2025
జగిత్యాలకు ఆ పేరు ఎలా వచ్చిందంటే

జగిత్యాలకు ఈ పేరు రావడానికి పలు రకాల కథనాలు వ్యాప్తిలో ఉన్నాయి. క్రీ.శ. 1110 నుంచి 1116 వరకు పొలాస రాజధానిగా జగ్గ దేవుడు పరిపాలించాడు. తన పరిపాలనా కాలంలో 21 యుద్ధాలు చేసి పరిసర ప్రాంతాల్లో పలు నూతన గ్రామాలను స్థాపించాడు. పొలాస దక్షిణాన 6 కి.మీ. దూరంలో జయదేవుడు అతని పేరిట జగ్గ దేవాలయం నిర్మించి ఉంటాడని, అదే జగిత్యాల స్థిరపడిందని చరిత్రకారుల కథనం. 2016లో జగిత్యాల ప్రత్యేక జిల్లాగా ఏర్పడింది.
Similar News
News February 23, 2026
ఇటు లొంగు‘బాట’.. అటు కర్రెగుట్టల్లో ఆగని వేట

TG: లొంగిపోయిన మావోయిస్టు కేంద్ర కమిటీ కీలక నేతలు TG పోలీసుల అదుపులో ఉన్నారు. మరోవైపు కర్రెగుట్టల్లో బడే దామోదర్, కేంద్ర కమిటీ సభ్యుడు మిసిర్ బేస్ లక్ష్యంగా భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. ప్రతి అంగుళాన్ని డ్రోన్ల సాయంతో జల్లెడ పడుతున్నాయి. అటు జెల్ల, తడపాల, డోలి అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల రహస్య బంకర్లను కోబ్రా దళాలు ధ్వంసం చేశాయి. మందుపాతరలను బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్ నిర్వీర్యం చేశాయి.
News February 23, 2026
ఆదిలాబాద్ గ్రీవెన్స్ డేలో 44 ఫిర్యాదులు: ఎస్పీ

ఆదిలాబాద్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో 44 ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తక్షణమే స్పందించి సంబంధిత అధికారులకు పరిష్కార ఆదేశాలు జారీ చేశారు. బాధితుల సమస్యలపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం 8712659973 వాట్సాప్ నంబర్‌కు పంపవచ్చని, వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.
News February 23, 2026
మార్చిలో 10 రోజులు సెలవులు!

TG: విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇది శుభవార్తే. ఎందుకంటే మార్చిలో ఏకంగా 10రోజులు సెలవులు రానున్నాయి. ఈ నెలలో 5 ఆదివారాలు ఉన్నాయి. ఇవే కాకుండా మార్చి 4న హోలీ, 14న రెండో శనివారం, 19న ఉగాది నేపథ్యంలో సెలవులు ఉండనున్నాయి. మార్చి 20న నెలవంక కనిపించడాన్ని బట్టి రంజాన్ హాలిడే ఉంటుంది. 26న శ్రీరామనవమి సెలవు కానుంది. 31న మహావీర్ జయంతి సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఉంటుంది. అంటే ఈ నెలంతా 10రోజులు సెలవులే.


