News February 4, 2025

జగిత్యాలలో ఉష్ణోగ్రతలు ఇలా..

image

జగిత్యాలలో ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. అత్యల్పంగా కథలాపూర్‌లో 15.8℃, గోవిందరామ్ 16, సారంగపూర్, మల్లాపూర్ 16.1, మద్దుట్ల 16.2, మన్నెగూడెం 16.3, గోదూరు 16.6, పొలాస, రాఘవపేట, పెగడపల్లె 16.7, తిరమలాపూర్, మాల్యాల్, మెట్పల్లె, జగ్గసాగర్, నేరెల్లా 16.8, కోరుట్ల 16.9, కొల్వాయి 17, ఐలాపూర్ 17.1, మేడిపల్లె, జగిత్యాల 17.3, ధర్మపురి 17.4, అల్లీపూర్ 17.5, గుల్లకోట 17.7, వెల్గటూర్లో 17.9℃గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News November 17, 2025

తిరుచానూరు వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

image

AP: తిరుపతి జిల్లాలోని తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక వార్షిక బ్రహ్మోత్సవాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం ధ్వజారోహణం జరగగా, రాత్రి చిన్నశేష వాహన సేవ ఉంటుంది. 18న పెద్దశేష వాహనం, 19న ముత్యపు పందిరి వాహనం, 20న కల్పవృక్ష వాహనం, 21న పల్లకీ ఉత్సవం, 22న సర్వభూపాల వాహనం, రాత్రి గరుడ వాహనం, 23న సూర్యప్రభ వాహనం, 24న రథోత్సవం, 25న పంచమీతీర్థం, రాత్రి ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగుస్తాయి.

News November 17, 2025

నస్రుల్లాబాద్: భారీగా రేషన్ బియ్యం పట్టివేత

image

నస్రుల్లాబాద్ మండలం దుర్కి చౌరస్తా వద్ద సోమవారం తెల్లవారుజామున పోలీసులు రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు బాన్సువాడ ఏఎస్ఐ సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో డీసీఎంలో తరలిస్తున్న దాదాపు 12 టన్నుల బియ్యను పట్టుకుట్లు పోలీసులు చెప్పారు. ఈ బియ్యం హైదరాబాద్ నుంచి గాంధారి మీదుగా కోటగిరిలోని ఓ రైస్ మిల్‌కు తరలిస్తున్నట్లు సమాచారం. డీసీఎంను నస్రుల్లాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

News November 17, 2025

సిద్దిపేట: వ్యర్థాలతో కలుషితమవుతున్న చెరువులు

image

మాంస, వైద్య వ్యర్థాలను చెరువుల్లో ఇష్టానుసారంగా పారవేయడం వలన జలాలు కలుషితమై దుర్వాసన వెదజల్లుతున్న సంఘటనలు సిద్దిపేట జిల్లావ్యాప్తంగా చాలా చోట్ల నెలకొంటున్నాయి. చెరువులు చెత్తా చెదారాలతో కలుషితమై దుర్వాసనలు వెదజల్లుతున్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువులపై అధికారులకు పట్టింపు లేదా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.