News February 4, 2025
జగిత్యాలలో ఉష్ణోగ్రతలు ఇలా..

జగిత్యాలలో ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. అత్యల్పంగా కథలాపూర్‌లో 15.8℃, గోవిందరామ్ 16, సారంగపూర్, మల్లాపూర్ 16.1, మద్దుట్ల 16.2, మన్నెగూడెం 16.3, గోదూరు 16.6, పొలాస, రాఘవపేట, పెగడపల్లె 16.7, తిరమలాపూర్, మాల్యాల్, మెట్పల్లె, జగ్గసాగర్, నేరెల్లా 16.8, కోరుట్ల 16.9, కొల్వాయి 17, ఐలాపూర్ 17.1, మేడిపల్లె, జగిత్యాల 17.3, ధర్మపురి 17.4, అల్లీపూర్ 17.5, గుల్లకోట 17.7, వెల్గటూర్లో 17.9℃గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News February 11, 2026
ఎయిర్‌పోర్ట్ నిర్మాణం అక్కడేనా?

అనంతపురం జిల్లాలో కార్గో విమానాశ్రయ ఏర్పాటుకు కేంద్ర పౌరవిమానయాన శాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇందుకు సుమారు 1,200 ఎకరాల భూమిని గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ నేపథ్యంలో మంగళవారం కుడేరు మండలం బ్రాహ్మణపల్లి వద్ద భూములను ఆర్డీవో కేశవ నాయుడు పరిశీలించారు. అనంతపురం సరిహద్దులోని కుడేరు మండలం, రాప్తాడు నియోజకవర్గంలోని కొంత భాగంలో ఈ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కానున్నట్లు సమాచారం.
Photo: AI
News February 11, 2026
ఎన్నికలకు 750 మంది పోలీసు బందోబస్తు: డీసీపీ

జనగామ, స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ ఎన్నికలకు మొత్తం 750 మంది పోలీస్ బందోబస్తును నియమించినట్లు జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ తెలిపారు. రెండు చోట్ల అదనపు ఎస్పీతో పాటు ఏఎస్పీ, ఏసీపీ, సీఐలు 7, ఎస్సైలు 32 మంది, పోలీస్ కానిస్టేబుళ్లతో పాటు బీఎస్ఎఫ్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సైతం ఎన్నికల విధుల్లో ఉంటారని పేర్కొన్నారు.
News February 11, 2026
అనకాపల్లి: 17 నుంచి జిల్లా స్థాయి క్రీడా జట్ల ఎంపిక పోటీలు

రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్ల ఎంపిక పోటీలను ఈనెల 17 నుంచి ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.శైలజ మంగళవారం తెలిపారు. అండర్ 13, 15, 17, 19 వరకు బాల బాలికలు అర్హులుగా పేర్కొన్నారు. అలాగే సైక్లింగ్ ఎంపిక పోటీలు ఈనెల 24న అనకాపల్లి పట్టణం సుంకరమెట్ట జంక్షన్ నుంచి దేవిపురం వరకు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి కలవారు తమ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.


