News February 3, 2025
జగిత్యాలలో కిడ్నాప్ కలకలం

జగిత్యాల చింతకుంట వాడలో పట్టపగలు కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. ఇంటి బయట ఆడుకుంటున్న పాపను ఓ జంట ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించగా స్థానికులు వారికి దేహశుద్ధి చేశారు. ఇంటి ముందు ఆడుకుంటున్న పాపకు చాక్లెట్ ఆశచూపి ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. పాప వాళ్లను చూసి ఇంట్లోకి వెళ్లి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో తల్లిదండ్రులతో పాటు ఇరుగుపొరుగు వారు వారిని పట్టుకన్నారని స్థానికులు పేర్కొన్నారు.
Similar News
News July 11, 2025
కరీంనగర్: ట్రాన్స్ జెండర్లకు శుభవార్త

ట్రాన్స్‌జెండర్ల ఉపాధికి తెలంగాణ ప్రభుత్వం కరీంనగర్‌లో ప్రత్యేక పథకం చేపట్టిందని జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్థిక స్వావలంబనకై వారికీ డ్రైవింగ్, బ్యూటీషియన్ వంటి నైపుణ్య శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు జూలై 23, 2025లోగా www.wdsc.telangana.goవ్.inలో దరఖాస్తు చేయాలని, వివరాలకు 040-24559050ను సంప్రదించాలని వివరించారు.
News July 11, 2025
సంగారెడ్డి: ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. అర్హత ఆసక్తి కలిగిన ఉపాధ్యాయులు ఈనెల 15లోగా http://nationalawardstoteachers.educatiin.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
News July 11, 2025
కృష్ణా: అన్నదాత సుఖీభవ అర్హుల జాబితా ఇదే.!

అన్నదాతా సుఖీభవ-PM కిసాన్ పథకానికి అర్హుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. రైతులు తమ ఆధార్ నంబర్‌ను మన మిత్ర వాట్సాప్ 9552300009కు పంపి అర్హతను తెలుసుకోవచ్చు. పేరు లేకుంటే గ్రామ రైతు సేవా కేంద్రంలో అర్జీ, పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. పోర్టల్ గ్రీవెన్స్ మాడ్యూల్‌లో ఫిర్యాదు నమోదు చేయవచ్చు. ఈనెల 13వ తేదీ వరకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. జిల్లాలో 3,44,029 రైతులు ఉండగా 1,35,881 అర్హత పొందారు.