News April 10, 2025

జగిత్యాలలో దొంగ అరెస్ట్‌.. బంగారు ఆభరణాలు స్వాధీనం

image

పలు చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగను జగిత్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు మంచిర్యాల జిల్లా బక్క శెట్టి కొమురయ్యగా గుర్తించారు. అతని నుంచి రూ.25 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు 25కుపైగా దొంగతనాలకు పాల్పడ్డాడని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. నిందితుడిని రిమాండుకు తరలించారు.

Similar News

News November 7, 2025

బండి సంజయ్‌పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

image

TG: కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని సీఈవోను పీసీసీ ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ కోరింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పింది. మతం ఆధారంగా ఓటు వేయాలని సంజయ్ కోరారని, ఎన్నికల నిబంధలను ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొంది.

News November 7, 2025

స్వర్గమంటే ఇదే.. హిమాచల్ అందాలు చూడండి!

image

వింటర్ వెకేషన్‌కు విదేశాలకు వెళ్లే పర్యాటకులను ఆకర్షించేందుకు హిమాచల్ ప్రదేశ్ టూరిజం సంస్థలు స్థానిక అందాలను SMలో పంచుకుంటున్నాయి. ప్రస్తుతం అక్కడ చెట్ల ఆకులన్నీ నారింజ రంగులోకి మారి, ప్రశాంత వాతావరణంతో భూతల స్వర్గంలా మారింది. ‘ఇది నార్వే కాదు.. హిమాచల్‌ప్రదేశ్’ అంటూ ‘Go Himachal’ పోస్ట్ చేసిన ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. ఈ సీజన్‌లో కులు మనాలీ, సిమ్లా వంటి ప్రదేశాలు పర్యాటకులతో కిటకిటలాడనున్నాయి.

News November 7, 2025

శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో ఉద్యోగాలు

image

తిరుపతిలోని <>శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ<<>>లో 24 అకడమిక్ కన్సల్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. M.Phil/PhD అర్హతగల అభ్యర్థులు ఈ నెల 17వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, దివ్యాంగులు రూ.500 చెల్లించాలి. వెబ్‌సైట్: https://svuniversityrec.samarth.edu.in