News April 10, 2025

జగిత్యాలలో దొంగ అరెస్ట్‌.. బంగారు ఆభరణాలు స్వాధీనం

image

పలు చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగను జగిత్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు మంచిర్యాల జిల్లా బక్క శెట్టి కొమురయ్యగా గుర్తించారు. అతని నుంచి రూ.25 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు 25కుపైగా దొంగతనాలకు పాల్పడ్డాడని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. నిందితుడిని రిమాండుకు తరలించారు.

Similar News

News April 24, 2025

గద్వాల: కాలువలో మహిళ మృతదేహం లభ్యం

image

జోగులాంబ గద్వాల పట్టణంలోని అగ్రహారం కాలువలో గుర్తుతెలియని వృద్ధ మహిళ మృతదేహం లభ్యమైందని పట్టణ ఎస్ఐ కళ్యాణ్ కుమార్‌ తెలిపారు. కాలువలో మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి వయసు సుమారు 60 ఏళ్లు ఉంటుందన్నారు. నల్లటి జాకెట్, పింక్ చీర ధరించి ఉందని, ఆమె ఆచూకీ ఎవరికైనా తెలిస్తే గద్వాల పట్టణ పోలీస్ పోలీసులను సంప్రదించాలని సూచించారు.

News April 24, 2025

కొండాపూర్: మోడల్ స్కూల్ హాల్ టికెట్లు విడుదల

image

జిల్లాలో ఈనెల 27న నిర్వహించే మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదల అయ్యాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. http://telanganams.cgg.gov.in అనే వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

News April 24, 2025

MNCL: ‘రెడ్డి సంక్షేమ సంఘాన్ని జిల్లాలో బలోపేతం చేస్తాం’

image

రెడ్డి సంక్షేమ సంఘాన్ని మంచిర్యాల జిల్లాలో బలోపేతం చేస్తామని రెడ్డి సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గుర్రం మోహన్ రెడ్డి అన్నారు. గురువారం మధ్యాహ్నం జిల్లాలోని మందమర్రి పట్టణానికి చెందిన కొంగల తిరుపతిరెడ్డిని, జిల్లా సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులుగా నియమించినట్లు వారు తెలిపారు. వారికి నియామక పత్రాన్ని అందించారు. రెడ్డి నాయకులు అంతా ఐక్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలన్నారు.

error: Content is protected !!