News January 25, 2025
జగిత్యాలలో నేటి ముఖ్యంశాలు..!

1. జిల్లావ్యాప్తంగా గ్రామ,వార్డు సభలు 2. అంబారీపేట్ ఫారెస్ట్ అర్బన్ పార్క్‌ను ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే 3. జగిత్యాలలో పురపాలక సంఘం ఆత్మీయ సమ్మేళనం 4. భీమారంలో ఉరి వేసుకొని మహిళ ఆత్మహత్య 5. మెట్పల్లి గ్రామసభలో వాగ్వాదం 6. మొగిలిపేట గ్రామసభలో మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం 7. ధరూర్‌లో ప్రమాదవశాత్తు కెనాల్‌లో పడ్డ రైతు.. తీవ్ర గాయాలు 8. ధర్మపురి లక్ష్మినరసింహస్వామి ఆలయానికి రూ.1,10,077ల ఆదాయం
Similar News
News February 15, 2025
అన్నమయ్య జిల్లాలో ప్రేమోన్మాది ఎమ్మెల్యే అనుచరుడి కుమారుడే: YCP

అన్నమయ్య జిల్లాలో యువతి గౌతమిపై ప్రమోన్మాది గణేశ్ యాసిడ్ దాడి రాష్ట్రంలో సంచలమైంది. ఈ ఘటనలో యువకుడు టీడీపీ కార్యకర్త అని వైసీపీ ఆరోపించింది. కదిరి ఎమ్మెల్యే వెంకటప్రసాద్ ముఖ్య అనుచరుడు మురళి కుమారుడే గణేశ్ అని ట్వీట్ చేసింది. యువకుడి తండ్రి మురళికి టీడీపీ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయంటూ పలు ఫొటోలను పోస్ట్ చేసింది. మరోవైపు ఈ ఘటనలో గాయపడ్డ యువతికి బెంగళూరులో చికిత్స అందిస్తున్నారు.
News February 15, 2025
ఆదిలాబాద్: అప్పు తీర్చలేక రైతు ఆత్మహత్య

ADB జిల్లా గుడిహత్నూర్ మండలం ఘర్కంపేట్ గ్రామానికి చెందిన మాధవ్ (53) అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం మధ్యాహ్నం ఆయన పురుగుమందు తాగి ఇంటికి వచ్చాడు. గమనించిన కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌లో రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ మహేందర్ తెలిపారు.
News February 15, 2025
HYD: అవినీతికి పాల్పడితే కాల్ చేయండి: ACB

గచ్చిబౌలి ఏడీఈ సతీష్ లంచం తీసుకుంటూ ఇటీవల ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు అవినీతికి పాల్పడితే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు సమాచారం అందించాలని సూచించారు. లేదా వాట్సప్ నంబర్ 9440446106కు సమాచారం అందించాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.