News August 23, 2024

జగిత్యాలలో బాలిక సూసైడ్

image

తల్లిదండ్రులు మందలించడంతో బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గోవింద్ పల్లెలో జరిగింది. ఎస్సై సతీష్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన హర్షిత(14) 9వ తరగతి చదువుతుంది. తల్లిదండ్రులు హాస్టల్లో ఉండమని మందలించడంతో 2రోజుల క్రితం గడ్డి మందు తాగింది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మరణించింది. తండ్రి అంజిత్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.

Similar News

News January 17, 2026

కరీంనగర్: చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలి: కలెక్టర్‌

image

స్థానిక బాల సదనంకు చెందిన తొమ్మిది, పన్నెండేళ్ల వయసున్న ఇద్దరు బాలికలను హైదరాబాద్‌కు చెందిన దంపతులకు జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి దత్తత ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సంతానం లేని వారు చట్టబద్ధంగా మాత్రమే దత్తత తీసుకోవాలని సూచించారు. ఆసక్తి గల వారు జిల్లా సంక్షేమ అధికారిని సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

News January 17, 2026

KNR: ఈనెల 20న అప్రెంటిస్‌షిప్‌ ఇంటర్వ్యూలు

image

జహీరాబాద్, సంగారెడ్డిలోని మహీంద్రా సంస్థలో 300 అప్రెంటిస్‌షిప్‌ ఖాళీల భర్తీకి ఈ నెల 20న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీధర్ తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ ఉత్తీర్ణులై, 18-25 ఏళ్ల వయసున్న కరీంనగర్ జిల్లా గ్రామీణ యువత దీనికి అర్హులు. ఆసక్తి గలవారు ఒరిజినల్ సర్టిఫికేట్లతో కరీంనగర్‌లోని స్వశక్తి కళాశాలలోని ఈజీఎంఎం కార్యాలయంలో హాజరుకావాలని ఆయన సూచించారు.

News January 16, 2026

KNR: కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు

image

కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి క్యాంప్ కార్యాలయంలో గురువారం సంక్రాంతి పండుగను సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. పల్లె సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి వేడుకలు ఉత్సాహంగా సాగాయి. ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణాన్ని రంగురంగుల ముగ్గులతో అలంకరించగా, సిబ్బంది పండుగ వాతావరణంలో పాల్గొన్నారు.