News July 17, 2024

జగిత్యాల్లో ఆటోమెటిక్ వాతావరణ కేంద్రం

image

జగిత్యాలలో వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ఆటోమెటిక్ వాతావరణ కేంద్రాన్ని భారత వాతావరణ శాస్త్ర విభాగం, భారత వ్యవసాయ పరిశోధన సంస్థ, భారత శాస్త్ర, సాంకేతిక విభాగం రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. దీంతో వాతావరణ పరిస్థితులను 5రోజుల ముందుగానే తెలుసుకోవచ్చు. వాతావరణాన్ని అంచనా వేసి సంబంధిత వాతావరణ కేంద్రానికి పంపిస్తారు. ఆ వివరాలు వాతావరణ కేంద్రం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు.

Similar News

News November 28, 2024

కరీంనగర్: ఫుడ్ పాయిజన్ ఘటనలను నిరసిస్తూ ABVP నిరసన

image

రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలను నిరసిస్తూ ఏబీవీపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘం నాయకులు కరీంనగర్ తెలంగాణ చౌక్ వద్ద ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పట్ల చిన్న చూపు చూస్తోందని ఆరోపించారు. నాసిరకం భోజనం పెడుతూ విద్యార్థుల ఆరోగ్యాలతో ఆటలాడుతోందని మండిపడ్డారు. సంబంధిత అధికారులు చొరవ చేసుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.

News November 28, 2024

పండగలు మీకు.. పస్తులు రైతులకా?: కేటీఆర్

image

కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించనున్న రైతు పండగలపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తీవ్రంగా మండిపడ్డారు. రైతు భరోసాకు ఎగనామం పెట్టి, రుణమాఫీ పేరుతో పంగనామాలు పెట్టి, లగచర్ల రైతులను జైలుపాలు చేసి అల్లుడి కళ్లలో ఆనందం చూసినందుకా? రైతును నిండా ముంచినందుకా? వ్యవసాయాన్ని ఆగం చేసినందుకా? రైతు పండుగలు అని ప్రశ్నించారు. పండుగలు మీకు.. పస్తులు రైతులకా? అని విమర్శించారు.

News November 28, 2024

కరీంనగర్: చలికాలం జాగ్రత్త!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చలి నెమ్మదిగా పంజా విసురుతోంది. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికాలంలో ఆహారం, నీటితో అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, అందుకు మూడు పూటలా వేడి ఆహారంతో పాటు కాచి చల్లార్చిన గోరువెచ్చని నీటిని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.