News March 11, 2025
జగిత్యాల: అంగన్వాడీల్లో ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్తో సరుకులు

అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే లబ్ధిదారులకు సరుకులను పారదర్శకంగా అందించాలని కేంద్ర ప్రభుత్వం ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం (FRS) ను తీసుకుని వచ్చింది. సరుకులు పక్కదారి పట్టకుండా ఈ పద్ధతిని తీసుకొని వచ్చిందని జగిత్యాల జిల్లా సంక్షేమ అధికారి నరేశ్ తెలిపారు. ఇప్పటి వరకు 78% అంగన్వాడీ కేంద్రాల్లో ఆధార్ వివరాలు పోర్టల్లో నిక్షిప్తం చేశారు. తెలంగాణా రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లా మొదటి స్థానంలో ఉందని అన్నారు.
Similar News
News September 18, 2025
జిల్లాలో ఎరువుల కొరత లేదు: కలెక్టర్

ఏలూరు జిల్లాలో ఇప్పటివరకు 83,761 మెట్రిక్ టన్నుల ఎరువులు రైతులకు సరఫరా చేసినట్లు కలెక్టర్ కె.వెట్రిసెల్వి గురువారం తెలిపారు. ప్రస్తుతం 29,512 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉండగా, మరో 259 మెట్రిక్ టన్నులు రానున్నాయని చెప్పారు. ఎరువుల కొరత లేదని స్పష్టం చేస్తూ, రైతులు మోతాదుకు మించి ఎరువులు వాడవద్దన్నారు. పంటలకు తగిన మోతాదులపై గ్రామ స్థాయి సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించారు.
News September 18, 2025
పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి: కలెక్టర్

జిల్లాలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. గురువారం కలెక్టరేట్లో పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి సంస్థ, పర్యాటకం, ఎంప్లాయిమెంట్, కేవీఐబీ అధికారులతో సమావేశమయ్యారు. కొత్త పరిశ్రమలు ఏర్పాటుకు సన్నాహక చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి చెందినప్పుడే స్థిరమైన వృద్ధిరేటు సాధించగలమన్నారు.
News September 18, 2025
ప్రజల గొంతు వినాలని ప్రభుత్వానికి లేదు: జగన్

AP: అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలని కూటమి ప్రభుత్వానికి లేదని YCP చీఫ్ జగన్ విమర్శించారు. ఆయన అధ్యక్షతన జరిగిన ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో మాట్లాడుతూ.. ‘ప్రతిపక్ష పార్టీగా గుర్తిస్తే సభలో మాట్లాడేందుకు టైం ఉంటుంది. ఆ గుర్తింపు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు రావట్లేదు. కానీ మండలిలో మనకు మంచి బలం ఉంది. మండలి సభ్యుల పాత్ర చాలా కీలకం. సభ్యులకు కూడా రాజకీయంగా ఎదగడానికి మంచి అవకాశం’ అని అన్నారు.