News February 27, 2026
జగిత్యాల: అంగన్వాడీల్లో అక్రమ వసూళ్లపై కలెక్టర్‌కు ఫిర్యాదు

జగిత్యాల జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో జరుగుతున్న అక్రమ వసూళ్లపై ఏఐటీయూసీ నాయకుడు వెన్న మహేష్ కలెక్టర్ సత్యప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. సూపర్వైజర్లు, సిడిపీవోలు వివిధ కార్యక్రమాల పేర్లతో అంగన్వాడీ టీచర్లు, ఆయాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. బిల్లులు, పండుగలు, బహుమతుల పేర్లతో వసూళ్లు జరుగుతున్నాయని పేర్కొంటూ, జిల్లా స్థాయిలో తక్షణ విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News April 19, 2026
అక్షయ తృతీయ రోజు ఏం చెయ్యాలి?

అక్షయ తృతీయ (నేడు) పుణ్యాన్ని సంపాదించుకోవాల్సిన రోజని పండితులు చెబుతున్నారు. ఈ పవిత్ర దినాన చేసే స్నానం, జపం, హోమం, దానాలు ‘అక్షయ’మైన (తరగని) ఫలితాలను ఇస్తాయని అంటున్నారు. ముఖ్యంగా ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగించేలా పేదలకు బట్టలు, గొడుగులు, చెప్పులు, చల్లని మజ్జిగ, నవధాన్యాలు దానం చేయడం విశేషమైన పుణ్యమని తెలుపుతున్నారు. ముఖ్యంగా నీటి కుండను దానం చేయడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుందని వివరిస్తున్నారు.
News April 19, 2026
MGU బీటెక్ పరీక్షల షెడ్యూల్ విడుదల

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలో బీటెక్ పరీక్షల షెడ్యూల్‌ను యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. సెమిస్టర్-2,4 (రెగ్యులర్ & బ్యాక్ లాగ్), సెమిస్టర్-1,3 (బ్యాక్ లాగ్) పరీక్షలు మే-5 నుంచి మే-21 మధ్య జరుగుతాయని పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. టైం టేబుల్‌ను అధికారక ఎంజీయూ వెబ్‌సైట్‌లో ఉంచామన్నారు.
News April 19, 2026
ఖమ్మం: హారన్ కొట్టారని.. కండక్టర్‌పై యువకుడి దాడి

రహదారిపై వెళ్తుండగా సైడ్ ఇవ్వాలని హారన్ కొట్టినందుకు ఓ యువకుడు ఏకంగా ఆర్టీసీ బస్సునే అడ్డుకుని హల్‌చల్ చేశాడు. నేలకొండపల్లి మండలం పైనంపల్లిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో.. డ్రైవర్ రాంబాబుతో వాగ్వివాదానికి దిగిన సదరు యువకుడు, కండక్టర్ మంజుల ఫోన్ లాక్కొని దురుసుగా ప్రవర్తించాడు. విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిపై దౌర్జన్యం చేసిన నిందితుడిని నేలకొండపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


