News April 14, 2025

జగిత్యాల: అంబేడ్కర్‌కు ఘన నివాళులు

image

భారతరత్న డా. బి.ఆర్. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని తహసిల్ చౌరస్తాలో విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అట్లూరి లక్ష్మణ్ కుమార్ పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి, కలెక్టర్ సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్, అదనపు కలెక్టర్ లత, సంఘ సభ్యులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Similar News

News April 17, 2026

KNR: ‘బ్యాక్‌డోర్’ ఆశ చూపి రూ.5 కోట్ల దోపిడీ

image

జాబ్ గ్యారెంటీ అంటూ ‘బ్యాక్‌డోర్’ ఆశ చూపి నిరుద్యోగుల జేబులకు భారీ కన్నం వేశారు కేటుగాళ్లు. సికింద్రాబాద్ కేంద్రంగా సాగిన ఈ ‘మాల్టా’ దందాలో 100మంది రూ.5కోట్లు పోగొట్టుకున్నారు. నకిలీ ఆఫర్ లెటర్లు సృష్టించి ఒక్కొక్కరి నుంచి రూ.4లక్షల వరకు వసూలు చేశారు. కరీంనగర్, ఖానాపూర్, KPHBలో బాధితులు ఫిర్యాదు చేయడంతో వీటన్నింటినీ ఏకీకృతం చేసి CIDకి బదిలీ చేశారు. ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఖాతాలను ఫ్రీజ్ చేశారు.

News April 17, 2026

వెల్గటూర్: స్టేట్ ఫస్ట్ సాధించిన సౌమ్యశ్రీని అభినందించిన టీచర్లు

image

వెల్గటూర్ మండలం పైడిపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని గాలి సౌమ్యశ్రీ జూనియర్ ఇంటర్ పరీక్షల్లో 470కి 469 మార్కులు సాధించి రాష్ట్ర తొలి స్థానం దక్కించుకుంది. ఈ సందర్భంగా ఆమెను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు తులసి ఆగమయ్య, ఉపాధ్యాయ బృందం, వార్డు సభ్యులు పాల్గొని అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.