News February 16, 2025
జగిత్యాల: అధికారులతో కలెక్టర్ సమీక్ష

జిల్లాలో అర్హత ఉన్న నిరుపేదలందరికీ ఇల్లు నిర్మించాలన్నదే ప్రభుత్వం లక్ష్యమని, ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు విధులు నిర్వహించాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. శనివారం కలెక్టర్లో గృహ నిర్మాణ శాఖ, ఎంపీడీవో, ఎంపీవో, ఏఈడీఈ, పంచాయతీ సెక్రటరీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయనతో పాటు అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి, డీఆర్డీవో రఘువరన్ ఉన్నారు.
Similar News
News December 5, 2025
నెల్లూరు: భారీ వర్షాలకు ఒకరు మృతి.. మరొకరు గల్లంతు..

నెల్లూరు ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలు రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. నెల్లూరు పొర్లుకట్ట ప్రాంతానికి చెందిన ఇంటర్ విద్యార్థి మస్తాన్ గురువారం పొట్టెపాలెం కలుజులో పడి మృతి చెందాడు. నెల్లూరు శివారు ప్రాంతం కొండ్లపూడికి చెందిన రవికుమార్ బుధవారం సాయంత్రం నెల్లూరు కాలువలో గల్లంతయ్యారని సమాచారం. తండ్రి గల్లంతైనట్లు రవికుమార్ కుమార్తె కావ్య గురువారం నెల్లూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News December 5, 2025
జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

<
News December 5, 2025
పల్లె టు కాశ్మీర్.. సరిహద్దులో కొండంరాజుపల్లి బిడ్డ

సిద్దిపేట జిల్లా కొండంరాజపల్లి గ్రామానికి బండి లక్ష్మి- తిరుపతి దంపతుల కుమారుడు బండి శ్రీనివాస్ అగ్నివీర్ పథకంలో దేశసేవకు అంకితమయ్యాడు. బెంగళూరులో ఆరు నెలల కఠోర శిక్షణను పూర్తి చేసిన శ్రీనివాస్ కల ఉద్యోగ పట్టాను అందుకున్నాడు. అతని పట్టుదలతో కాశ్మీర్లో దేశ సేవలకు వెళ్తున్నాడు. ఈ విజయం పట్ల స్వగ్రామంలో ఆనందం నెలకొంది.


