News February 16, 2025

జగిత్యాల: అధికారులతో కలెక్టర్ సమీక్ష

image

జిల్లాలో అర్హత ఉన్న నిరుపేదలందరికీ ఇల్లు నిర్మించాలన్నదే ప్రభుత్వం లక్ష్యమని, ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు విధులు నిర్వహించాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. శనివారం కలెక్టర్‌లో గృహ నిర్మాణ శాఖ, ఎంపీడీవో, ఎంపీవో, ఏఈడీఈ, పంచాయతీ సెక్రటరీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయనతో పాటు అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి, డీఆర్‌డీవో రఘువరన్ ఉన్నారు.

Similar News

News March 22, 2025

డీలిమిటేషన్‌: ప్రాంతీయ భాషలో నేమ్ బోర్డ్స్!

image

డీలిమిటేషన్‌ మీట్‌కు వివిధ రాష్ట్రాల నుంచి CMలు, పార్టీల ప్రతినిధులు హాజరైన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ కనిపించిన ఓ విషయంపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. పార్లమెంట్‌లో ఉన్నట్లు ఆయా పార్టీల ప్రతినిధుల పేర్లను ఇంగ్లిష్‌తో పాటు వారి భాషల్లో నేమ్ బోర్డ్స్ ఏర్పాటు చేశారు. CM రేవంత్ & KTR వద్ద తెలుగు బోర్డులు కనిపించాయి. కాగా, మొదటి నుంచి TN ప్రభుత్వం హిందీని వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.

News March 22, 2025

ప్రశాంత వాతావరణంలో 10వ తరగతి పరీక్షలు

image

శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు 38 కేంద్రాలలో ప్రశాంత వాతావరణంలో జరిగినట్లు డీఈవో కృష్ణప్ప తెలిపారు. శనివారం నిర్వహించిన పరీక్షకు రెగ్యులర్ విద్యార్థులు 1,337 మందికి గాను 1,335 మంది హాజరయ్యారన్నారు. ప్రైవేట్ విద్యార్థులు 8 మందికి గాను ముగ్గురు హాజరైనట్లు పేర్కొన్నారు. మొత్తం 1,345 మందికి గాను 1,338 మంది పరీక్షలకు హాజరు కాగా.. ఏడుగురు గైర్హాజరయ్యారని తెలిపారు.

News March 22, 2025

రాష్ట్రంలో 10,954 ఉద్యోగాలు

image

TG: రాష్ట్ర రెవెన్యూ శాఖలో కొత్తగా 10,954 గ్రామ పాలనా అధికారుల పోస్టులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ వీఆర్వోలు, మాజీ VRAల నుంచి ఆప్షన్లు తీసుకుని ఈ నియామకాలు చేపట్టనున్నారు. త్వరలోనే ప్రక్రియ మొదలుకానుంది. ఇటీవల క్యాబినెట్ సమావేశంలో ఈ ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

error: Content is protected !!