News February 1, 2025
జగిత్యాల: అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్ XI విజయవంతం:ఎస్పీ

జిల్లాలోని అన్నిశాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్ XI విజయవంతంగా నిర్వహించామని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి సంవత్సరంలో రెండు సార్లు ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను నిర్వహించి తప్పిపోయిన మహిళలను గుర్తించి వారి తల్లితండ్రుల వద్దకు చేర్చడానికి ఉపయోగపడుతుందన్నారు. బాలల హక్కులు కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
Similar News
News November 28, 2025
శంషాబాద్: సమతా స్ఫూర్తి కేంద్రంలో 30న ఈక్వాలిటీ రన్

శంషాబాద్ మండలం ముచ్చింతల్ శివారులోని సమతా స్ఫూర్తి కేంద్రం వద్ద ఈనెల 30న ఈక్వాలిటీ రన్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి పర్యవేక్షణలో రన్ ఫర్ ఈక్వాలిటీ, ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్ అనే నినాదంతో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.హాఫ్ మారథాన్, 10కే, 5కే, 3కే విభాగాల్లో పరుగు ప్రారంభం అవుతుందన్నారు.
News November 28, 2025
4 వారాలుగా అనుమతించట్లేదు: ఇమ్రాన్ ఖాన్ సోదరి

జైలులో ఉన్న తన సోదరుడు ఇమ్రాన్ ఖాన్ను 4 వారాలుగా కలవనివ్వట్లేదని సోదరి నొరీన్ నియాజీ తెలిపారు. ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన నెలకొందన్నారు. ‘ఇమ్రాన్ ఖాన్ విషయంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు. జైలు అధికారులు ఏం చెప్పట్లేదు. మా సోదరుడిని చంపేసినట్లు వార్తలొస్తున్నాయి’ అని వాపోయారు. అంతకుముందు ఖైబర్ పఖ్తుంఖ్వా CM సోహైల్ రావల్పిండిలోని జైలు ముందు బైఠాయించి ఇమ్రాన్ ఖాన్కు మద్దతుగా నిరసన తెలిపారు.
News November 28, 2025
వేములవాడ పోలీసుల అదుపులో నిందితుడు సంతోశ్..!

మాజీ నక్సలైట్ బల్లెపు నర్సయ్య అలియాస్ సిద్ధయ్య హత్య కేసులో నిందితుడిగా భావిస్తున్న జక్కుల సంతోశ్ వేములవాడ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. తాను అజ్ఞాతంలో ఉండగా ఎందరినో చంపినట్లుగా నర్సయ్య ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పేర్లతో సహా చెప్పడంతో తన తండ్రిని నర్సయ్య చంపినట్లుగా నిర్ధారణకు వచ్చిన సంతోశ్ యూట్యూబ్ ఛానల్ కోసం ఇంటర్వ్యూ కావాలంటూ నర్సయ్యను పిలిపించి హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు.


