News March 19, 2025
జగిత్యాల: అప్పుల బాధతో ఉరివేసుకుని రైతు ఆత్మహత్య

జగిత్యాల మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన మతలాపురం రాజం(55) ఊరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం జరిగింది. సాగుకు, ఇంటి అవసరాలకు రూ.10 లక్షలు అప్పుకావడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి కుమారుడు మల్లేష్ తెలిపారు. మల్లేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News November 15, 2025
NLG: ఉపాధ్యాయుల్లో ‘టెట్’ టెన్షన్!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉపాధ్యాయులకు టెట్ టెన్షన్ పెరిగింది. పీఈటీలు, పీడీలు మినహా ఇతర ఉపాధ్యాయులంతా రెండేళ్లలో టెట్ అర్హత సాధించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఇన్ సర్వీసు టీచర్లలో ఆందోళన నెలకొంది. పదోన్నతులు, ఉద్యోగ భద్రతపై అనిశ్చితి వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాలో సుమారు 5 వేల మందికి టెట్ తప్పనిసరి కావడంతో ఉపాధ్యాయ సంఘాలు మినహాయింపు కోసం ఎన్సీటీఈ, ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
News November 15, 2025
HYD: పదే పదే లీకేజీలతో.. నీటి సరఫరాలో అంతరాయం

HYD నగరానికి నీటి సరఫరా చేసే జలమండలి పైప్ లైన్లు పదే పదే లీకేజీ కావడంతో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. 2,3 రోజులపాటు ప్రజల ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా జలమండలి తగిన చర్యలు తీసుకోవాలని నగరంలోని సరూర్నగర్, ఉప్పల్, నాంపల్లి, అత్తాపూర్ ప్రాంతాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
News November 15, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

* ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
* దివంగత కవి అందెశ్రీ కొడుకు దత్తసాయికి డిగ్రీ లెక్చరర్ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం యోచన
* నల్గొండ జిల్లాలో వైద్యం వికటించి 17 మంది చిన్నారులకు అస్వస్థత.. వైరల్ ఫీవర్తో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన పిల్లలకు ఇంజెక్షన్ చేయడంతో రియాక్షన్
* నేడు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ


