News March 2, 2025
జగిత్యాల: ఆటో డ్రైవర్ అనుమానాస్పద మృతి

జగిత్యాల మున్సిపల్ పరిధిలోని టీఆర్ నగర్‌కు చెందిన షేక్ రఫీ అనే ఆటో డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. శనివారం సాయంత్రం ఇంట్లో నుండి వెళ్లిన రఫీ ఆదివారం తెల్లవారుజామున టీఆర్ నగర్‌లోని మీ సేవ కేంద్రం సమీపంలో మృతదేహాన్ని గుర్తించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు జగిత్యాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 19, 2025
ఎచ్చెర్ల: భార్యపై అనుమానంతో హత్య

ఎచ్చెర్ల మండలంలో భార్యను, భర్త దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. ఎచ్చెర్లలోని సంతసీతాపురానికి చెందిన నాగమ్మ(40), అప్పలరెడ్డి కూలిపనులు చేస్తూ జీవనం సాగించేవారు. భార్యపై అనుమానంతో సోమవారం రాత్రి మద్యం తాగి ఇంటిలో గొడవపడ్డాడు. క్షణికావేశంలో కత్తితో తల, మెడలపై దాడి చేయగా ఆమె మృతి చెందింది. కుమారుడు త్రినాథ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని సీఐ అవతారం తెలిపారు.
News March 19, 2025
ఆటో ప్రమాదంలో ఒకరు మృతి

తాడిపత్రి మండలంలోని సజ్జలదిన్నె వద్ద జరిగిన ఆటో రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. తాడిపత్రిలోని శ్రీనివాసపురానికి చెందిన రసూల్ బేగం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. నంద్యాల జిల్లా పేరు సోమల గ్రామానికి మిర్చి కోసేందుకు వెళ్లి వస్తున్న సందర్భంలో ఆటో బోల్తా పడటంతో మృతి చెందింది.
News March 19, 2025
ఖమ్మం జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు

ఖమ్మం జిల్లా మధిరలో మంగళవారం అత్యధికంగా 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అటు కామేపల్లి, కారేపల్లిలో 39.7, సత్తుపల్లి 39.5, వైరా 39.3, ముదిగొండ (పమ్మి) 39.3, వేంసూరు, పెనుబల్లి 38.9, నేలకొండపల్లి 38.8, రఘునాథపాలెం 38.7, కొణిజర్ల 38.2, కల్లూరు 37.2, ఖమ్మం అర్బన్ 37.9, ఖమ్మం రూరల్ (పల్లెగూడెం) 37.6, ఏన్కూరు (తిమ్మరావుపేట) 37.5డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపారు.