News February 18, 2025
జగిత్యాల: ఆదర్శ పాఠశాలల్లో దరఖాస్తుల ఆహ్వానం

జగిత్యాల జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఫిబ్రవరి 28లోగా విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 13న ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలకు www.telanganams.cgg.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.
Similar News
News November 10, 2025
HYDలో అలర్ట్.. విస్తృత తనిఖీలు

ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పోలీసులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్, చెన్నై, ముంబైతో పాటు ఇతర ప్రధాన నగరాల్లో తనిఖీలు చేపడుతున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, అనుమానాస్పద వాహనాల్లో చెకింగ్స్ చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో RPF, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. మరోవైపు CISF దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది.
News November 10, 2025
ధాన్యం కొనుగోళ్లపై మంత్రుల సమీక్ష

రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కలెక్టర్లను ఆదేశించారు. సీఎస్ రామకృష్ణారావుతో కలిసి వారు ధాన్యం, పత్తి, సోయా కొనుగోలు కేంద్రాల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్రాలను వెంటనే ప్రారంభించి, ధాన్యాన్ని త్వరగా తరలించాలని సూచించారు.
News November 10, 2025
ఢిల్లీలో పేలుడు.. అప్రమత్తమైన కర్నూలు పోలీసులు

ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన భారీ పేలుడు నేపథ్యంలో కర్నూల్ వ్యాప్తంగా అప్రమత్తతా చర్యలు ప్రారంభమయ్యాయి. సోమవారం రాత్రి కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా పోలీసు బలగాలు ముమ్మర తనిఖీలు చేపట్టాయి. కర్నూలు, గుత్తి పరిధిలోని పెట్రోల్ బంకులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, టోల్ గేట్లు, రద్దీ ప్రాంతాల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వాహనాలు, అనుమానాస్పద వ్యక్తులను పరిశీలించారు.


