News February 25, 2026

జగిత్యాల: ‘ఆరోగ్య, భీమా పథకాలు ఆగకుండా చూడాలి’

image

ప్రభుత్వం ప్రకటించిన ఆరోగ్య, భీమా పథకాలు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగాలని సీనియర్ సిటిజన్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ కోరారు. తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ జిల్లా సమావేశంలో మాట్లాడుతూ.. భీమా వయోపరిమితిని 70 ఏళ్లకు పెంచాలని, పెండింగ్ డీఏలు, బకాయిలు విడుదల చేసి పీఆర్‌సీ ప్రకటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేశారు. ఆరోగ్య పథకానికి ఈపీహెచ్‌ఎస్ పేరు పెట్టాలని సూచించారు.

Similar News

News April 18, 2026

ఈ ఆహారంలో పుష్కలంగా విటమిన్ B12

image

విటమిన్ B12 <<19680368>>లోపాన్ని<<>> నివారించేందుకు పోషకాహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మాంసం, చేపలు, గుడ్లు, పాలు, పెరుగులో ఈ విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. ‘శాకాహారులు ఫోర్టిఫైడ్ ధాన్యాలు, సోయా పాలు తీసుకోవడం ఉత్తమం. నరాల బలహీనత, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకోవాలి. లోపం తీవ్రంగా ఉంటే వైద్యుల సలహాతో సప్లిమెంట్లు వాడండి’ అని వివరిస్తున్నారు.

News April 18, 2026

ఉమ్మడి KNR జిల్లాలో కొనసాగుతున్న ఎండ తీవ్రత

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. జగిత్యాల జిల్లా గోదూరు 44.2℃తో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా.. అల్లీపూర్లో 44.1℃గా నమోదైంది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి-ధర్మారంలో 44.1, వీణవంక 43.8℃, పెద్దపల్లి జిల్లా రామగుండం 44, ఆకెనపల్లి 43.9℃, రాజన్న సిరిసిల్ల జిల్లా నాంపల్లి 43.5, పెద్దలింగాపురంలో 43.4℃ ఉష్ణోగ్రత నమోదైంది. తీవ్రమైన ఎండలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

News April 18, 2026

ఉపాధి హామీ పథకాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ నాగరాణి

image

పోడూరు గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను జిల్లా కలెక్టర్ నాగరాణి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భ గుర్రపుడెక్కతో సహజ ఎరువు తయారు చేసే మిషన్‌ను ఆమె ప్రారంభించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఉపాధి హామీ పథకం బలమైన ఆధారమని, ప్రతి కార్మికుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో దాసిరాజు, అధికారులు పాల్గొన్నారు.