News March 24, 2025
జగిత్యాల: ఆర్మీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

ప్రభుత్వ రంగ సంస్థ ఆర్మీలో వివిధ కేటగిరీలలో ఉద్యోగాల నియామకం కోసం నోటిఫికేషన్ వెలువడిందని జిల్లా ఉపాధి కల్పన అధికారి సత్యమ్మ తెలిపారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్కు, స్టోర్ కీపర్ టెక్నికల్, ట్రేడ్స్ మాన్ తదితర ఉద్యోగాలు ఉన్నాయన్నారు. వయస్సు 17 నుంచి 21 మధ్య ఉండాలన్నారు. ఆసక్తి గలవారు ఏప్రిల్ 10 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 040-27740205 నంబర్ను సంప్రదించాలన్నారు
Similar News
News October 28, 2025
ప్రకాశం: ‘గర్భవతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి’

గర్భవతులు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ సుధా మారుతి తెలిపారు. తుఫాన్ ప్రభావం వల్ల గర్భవతులు అప్రమత్తంగా ఉండాలని, డెలివరీ తేదీకంటే ముందుగానే హాస్పిటల్లో చూపించుకోవాలని తెలిపారు. ప్రతి గర్భిణీ స్త్రీ ఆరోగ్యాన్ని అంగన్వాడీలు స్వయంగా వారి ఇంటికి వెళ్లి పరిశీలించడం జరుగుతుందన్నారు. చిన్నారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News October 28, 2025
క్యాబిన్ క్రూ జాహ్నవి గుప్తా ఆత్మహత్య

రాజేంద్రనగర్ పరిధిలో ఇండిగో ఎయిర్లైన్స్లో క్యాబిన్ క్రూగా పనిచేస్తున్న జాహ్నవి గుప్తా ఆత్మహత్య చేసుకుంది. జమ్మూకు చెందిన జాహ్నవి, ఇటీవల ఇండిగో క్యాప్టెన్, స్నేహితుడితో కలిసి పార్టీకి హాజరై, అనంతరం తన గదిలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. కొన్ని రోజులుగా ఆమె డిప్రెషన్లో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, ఆత్మహత్యకు గల కారణాలను మాత్రం తల్లిదండ్రులు పోలీసులకు వెల్లడించడం లేదు.
News October 28, 2025
చెకుముకి సైన్స్ సంబరాల పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

NLG: చెకుముకి సైన్స్ సంబరాలు 2025 పోస్టర్ను కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం తన ఛాంబర్లో ఆవిష్కరించారు. పాఠశాల స్థాయిలో 8, 9 10వ తరగతుల విద్యార్థులకు సైన్స్ టెంపర్ని అవగాహన కల్పించేలా ప్రతి ఏటా జన విజ్ఞాన వేదిక నిర్వహిస్తున్న చెకుముకి టాలెంట్ టెస్ట్ నిర్వహణకు సహకరించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో దేవరకొండ ఏఎస్పీ మౌనిక, జేవీవీ రాష్ట్ర కమిటీ సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.


