News June 17, 2024

జగిత్యాల: ఆస్తి తగాదాలతో కుమారుడి హత్య

image

ఆస్తి తగాదాలతో కుమారుడిని తండ్రి హత్య చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. స్థానికుల వివరాలు.. కోరుట్ల మండలం మోహనరావుపేటకు చెందిన తండ్రి గంగరాజన్, కుమారుడు రాజేశ్(32) మధ్య ఆదివారం రాత్రి ఆస్తి విషయంలో వివాదం జరిగింది. ఈ క్రమంలో గొడవ మరింత పెరిగి గంగరాజన్ రాజేశ్‌ను కత్తితో దాడి చేశాడు. వెంటనే రాజేశ్‌ను HYD తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. గంగరాజన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Similar News

News November 23, 2025

KRM: స్కాలర్‌షిప్ NMMS పరీక్షకి 77మంది గైర్హాజరు

image

కరీంనగర్ జిల్లాలో 7 పరీక్షా కేంద్రాలల్లో NMMS ఆదివారం 9:30 నుంచి12:30 నిర్వహించినట్లు జిల్లా విద్యాధికారి మొండయ్య తెలిపారు. పరీక్షకు 1,507 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 1,430 మంది హాజరయ్యారని తెలిపారు. 7 పరీక్షా కేంద్రాలలో సిట్టింగ్ స్క్వాడ్‌లతో పాటు 02 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించబడినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాలల్లో ఎలాంటి అవాంతరాలు కలుగలేదని జిల్లా విద్యాధికారి తెలిపారు.  

News November 23, 2025

KNR: సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్ టెక్నిషియన్‌లో ఉచిత శిక్షణ

image

క్రాష్ ప్రొఫెషనల్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సుకు నిరుద్యోగ క్రైస్తవ మైనార్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టి సంక్షేమ శాఖ అధికారి తెలిపారు. సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్ టెక్నిషియన్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తుతో పాటు అభ్యర్థి ఆధార్ కార్డు, క్యాస్ట్, ఇన్ కమ్ సర్టిఫికెట్లును DEC 10 లోపు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయంలో సమర్పించాలి.

News November 22, 2025

కరీంనగర్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

image

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను నియమిస్తున్నట్లు ఏఐసీసీ (AICC) జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. అలాగే, కరీంనగర్ టౌన్ ప్రెసిడెంట్‌గా అంజన్ కుమార్‌ను అధిష్ఠానం ఖరారు చేసింది. పలువురు ఆశావహులు పోటీలో ఉన్నప్పటికీ, అధిష్ఠానం మేడిపల్లి సత్యం, అంజన్ కుమార్‌లకు ఈ బాధ్యతలను అప్పగించింది.