News March 24, 2025
జగిత్యాల: ఆ ప్రాంతంలో MLA ఉప ఎన్నికలు అనివార్యమేనా?

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. రేపు ఈ కేసును ధర్మాసనం విచారించనుంది. ఈ క్రమంలో జగిత్యాలలో BRS నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన సంజయ్ కుమార్‌పై అనర్హత వేటు పడుతుందా.. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. జగిత్యాలలో ఉప ఎన్నికలు జరుగుతాయా అని స్థానికంగా జోరుగా చర్చ నడుస్తోంది. దీనిపై మీ కామెంట్?
Similar News
News November 4, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఒకరి మృతి

సత్యసాయి (D) చెన్నేకొత్తపల్లి మండలం దామాజిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జబ్బార్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో సురక్ష (30) అనే మహిళ మృతి చెందారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సుకు ఐచర్ వాహనం అడ్డురావడంతో అదుపు తప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మరో 8 మంది గాయపడ్డారు. వారిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ఉన్నారు.
News November 4, 2025
బియ్యం స్మగ్లింగ్ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు: జేసీ

ఏలూరు జిల్లాలో పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ తెలిపారు. హమాలీలు, రైతులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా అన్లోడింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని సోమవారం ఆయన సూచించారు. ధాన్యం రవాణాలో లారీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్లు మంచి ఫలితాలు సాధించాలని జేసీ అభిషేక్ గౌడ ఆకాంక్షించారు.
News November 4, 2025
VZM: ఈ సంక్రాంతికీ కష్టాలు తప్పేలా లేవు..!

ఉత్తరాంధ్ర వలస జీవులకు ఈ ఏడాదీ సంక్రాంతి కష్టాలు తప్పేలా లేవు. చెన్నై, బెంగళూరు, HYD, విజయవాడ వంటి సుదూర ప్రాంతాలకు వలస వెళ్లే వారు సంక్రాంతికి సొంతూళ్లకు చేరుకుంటారు. ఆయా ప్రాంతాల నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలకు రైళ్లు తక్కువ సంఖ్యలో ఉండటంతో బస్సులను ఆశ్రయించేవారు. అయితే ఇటీవల వరుస ప్రమాదాలు జరుగుతుండటంతోపాటు స్త్రీశక్తి పథకం కారణంగా బస్సులు ఎక్కేందుకు జంకుతున్నారు. రైళ్ల సంఖ్య పెంచాలని కోరుతున్నారు.


