News March 24, 2025

జగిత్యాల: ఇంగ్లిష్ పరీక్షకు 8 మంది గైర్హాజరు

image

జగిత్యాల జిల్లాలో పదోతరగతి పబ్లిక్ పరీక్షలలో భాగంగా మూడోరోజు ఇంగ్లిష్ పేపర్ రెగ్యులర్ పరీక్షకు మొత్తం 11845 విద్యార్థులకు 11839 విద్యార్థులు హాజరయ్యారు. ఆరుగురు విద్యార్థులు గైర్హాజరయ్యారు. రెగ్యులర్ విద్యార్థుల హాజరు శాతం 99.95% ఉండగా.. సప్లమెంటరీ విద్యార్థులకు సంబంధించిన పరీక్ష కేంద్రాలలో 27 విద్యార్థులకు 25 మంది విద్యార్థులు గైర్హజరయ్యారు. వీరి హాజరుశాతం 85.19%. ఉంది అని అధికారులు తెలిపారు.

Similar News

News April 2, 2025

సిరిసిల్ల జిల్లాలోని ఉష్ణోగ్రతల వివరాలు

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గడిచిన 24 గంటలలో ఉష్ణోగ్రత వివరాలు ఇలా నమోదు అయ్యాయి. వీర్నపల్లి 38.1 °c, సిరిసిల్ల 38.0°c, ఇల్లంతకుంట 37.6°c,రుద్రంగి 37.5 °c,కోనరావుపేట 37.4°c, తంగళ్ళపల్లి 37.3 °c, ఎల్లారెడ్డిపేట 35.0°c లుగా నమోదు అయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు మండలాలలో వాతావరణం స్వల్పంగా చల్లబడింది.

News April 2, 2025

సిరిసిల్ల: సర్దార్ పాపన్న పోరాటం మరువలేనిది: కలెక్టర్

image

బహుజనుల కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటం మరువలేనిదని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో సర్ధార్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయన చేసిన పోరాటం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని స్పష్టం చేశారు.

News April 2, 2025

అనంతపురం జిల్లాలో HM సస్పెండ్

image

అనంతపురం జిల్లా ఆత్మకూరు ZPHS హెచ్‌ఎం శ్రీనివాస్ ప్రసాద్‌పై పాఠశాల విద్య కడప RJD శామ్యూల్ మంగళవారం సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఆత్మకూరు ZPHSలో పరీక్ష రాసేందుకు 10th విద్యార్థిని వెళ్లింది. పరీక్ష జరిగే సమయంలో ఆ విద్యార్థిని ప్రశ్నాపత్రం మిస్ అయిందని చెప్పగా.. చీఫ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఆమెను భుజంపై కర్రతో కొట్టారు. దీంతో విద్యార్థిని కాలర్ బౌన్ విరిగగా ఆయనను సస్పెండ్ చేశారు.

error: Content is protected !!