News March 1, 2025
జగిత్యాల: ఇంటర్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

జగిత్యాల జిల్లాలో ఈ నెల 5 నుంచి 25వరకు ఇంటర్ పరీక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేశామని జిల్లా ఇంటర్ విద్యాధికారి నారయణ తెలిపారు. ఇంటర్ పరీక్షలు ఉ. 9.00 నుంచి మ.12.00 వరకు పరీక్షలు జరుగుతాయని, ఇంటర్ మొదటి సంవత్సరంలో 7073 మంది, రెండో సంవత్సరంలో 7377, మొత్తం 14450 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి సందేహాలున్నా టెలిమానస్ 14416కు ఫోన్ చేయాలన్నారు.
Similar News
News March 18, 2025
నల్గొండ: ప్రతి గ్రామానికి ఒక పోలీస్ అధికారి: SP

జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి, ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి ప్రతి గ్రామానికి ఒక పోలీస్ అధికారిని నియమిస్తున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. సోమవారం పోలీస్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ప్రతి గ్రామంలో వీపీవో క్రమం తప్పకుండా సందర్శించి, ఆయా గ్రామాల్లో ఉన్న సమస్యల పరిష్కార దిశగా కృషి చేయాలని సూచించారు.
News March 18, 2025
సిద్దిపేట: కుష్టు రహిత సమాజాన్ని నిర్మిద్దాం: DMHO

కుష్టు రహిత సమాజాన్ని నిర్మిద్దామని డీఎంహెచ్ఓ పల్వాన్ కుమార్ అన్నారు. జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ అరుణ్ కుమార్ అధ్యక్షతన జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కుష్టు రహిత సమాజాన్ని నిర్మించేందుకు జిల్లాలో మార్చి 17 నుంచి 30 వరకు క్షేత్రస్థాయిలో ఆశా కార్యకర్తల ద్వారా ఇంటింటికి వెళ్లి కుష్టు వ్యాధి లక్షణాలున్న వారిని ముందస్తుగా గుర్తించి వైద్యం అందించనున్నట్లు తెలిపారు.
News March 18, 2025
ADB: పోలీసులను బెదిరించిన మహిళపై కేసు: CI

మట్కా జూదం నిర్వహిస్తున్న మహిళాగ్యాంగ్‌ను ఆదిలాబాద్ టూటౌన్ పోలీసులు స్థానిక ఇంద్రానగర్‌లో అరెస్టు చేశారు. అరెస్టు చేసే క్రమంలో ఫర్జానా సుల్తానా అనే మహిళ పోలీస్ స్టేషన్‌కు రానని.. తనను స్టేషన్కు తీసుకెళ్తే గొంతు కోసుకుంటానంటూ పోలీసులను బెదిరించింది. బ్లేడుతో గొంతు కోసుకోవడానికి ప్రయత్నించి భయపెట్టించింది. దీంతో ఆమెపై మట్కా కేస్‌తోపాటు బెదిరించినందుకు మరో కేసును నమోదు చేసినట్లు CI కరుణాకర్ తెలిపారు.