News March 1, 2025
జగిత్యాల : ఇంటర్ పరీక్షలు సజావు నిర్వహించాలి: సీఎస్

జిల్లాలో ఇంటర్ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్ శాంతికుమారి సూచించారు. శుక్రవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ బి. సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ బీఎస్ లతతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రశ్నపత్రాల తరలింపు పోలీస్ బందోబస్తు మధ్య నిర్వహించాలన్నారు. పరీక్ష కేంద్రంలోకి ఎవరికీ సెల్‌ఫోన్‌ను అనుమతించవద్దన్నారు.
Similar News
News March 15, 2025
విశాఖలో జూన్ 1నుంచి జరిమానా

సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు స్వస్తి పలుకుదామని ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా ప్రత్యేకాధికారి కాటమనేని భాస్కర్ అన్నారు. శనివారం విశాఖ ఆర్‌కె బీచ్ వద్ద స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్ర అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. జనవరి 1నుంచి ప్లాస్టిక్ వస్తువులు వాడొద్దని చెప్పినా అక్కడక్కడ కనిపిస్తూన్నాయన్నారు. జూన్ 1నుంచి సింగల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగదారులకు జరిమానాలు విధిస్తామని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు.
News March 15, 2025
ప్రకాశ్ రాజ్‌కు బండ్ల గణేశ్ కౌంటర్?

AP: సినీ నిర్మాత బండ్ల గణేశ్ Xలో ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇది నటుడు ప్రకాశ్ రాజ్‌కు కౌంటర్‌గానే ట్వీట్ చేసినట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ‘కృతజ్ఞత లేకుండా బతకడం మానవత్వాన్ని కోల్పోవడమే. ద్రోహంతో బతకడం మనుష్యత్వాన్ని నాశనం చేసుకోవడమే. మనం ఎప్పుడూ కృతజ్ఞతతో జీవించాలి’ అని రాసుకొచ్చారు. కాగా నిన్న డిప్యూటీ సీఎం <<15764256>>పవన్ కళ్యాణ్<<>>పై ప్రకాశ్ రాజ్ ఓ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
News March 15, 2025
MHBD జిల్లా అమ్మాయికి వరుస ఉద్యోగాలు

మహబూబాబాద్ పట్టణానికి చెందిన డోలి సంధ్య గ్రూప్-3లో 269.9 మార్కులతో 1,125 ర్యాంకు సాధించింది. జోనల్ స్థాయిలో బీసీ-ఏ మహిళా విభాగంలో రెండో ర్యాంకు సాధించింది. ఇప్పటికే గ్రూప్-4 లో ఉన్నత ర్యాంకు సాధించిన సంధ్య మున్సిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తుంది. అదే విధంగా ఈ నెల 11న విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో సంధ్య 382.4 మార్కులతో 205 ర్యాంకు సాధించింది.