News January 29, 2025

జగిత్యాల: ఇంటర్ ప్రాక్టికల్స్ సజావుగా జరిగేలా చూడాలి: అడిషనల్ కలెక్టర్

image

ఫిబ్రవరి 3 నుంచి జరగనున్న ఇంటర్ ప్రాక్టికల్స్ సజావుగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వివిధ డిపార్ట్మెంట్స్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్‌తో బుధవారం జరిగిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన సహాయ సహకారాలు వివిధ శాఖల అధికారులు అందించాలని పరీక్షల కన్వీనర్ నారాయణ కోరారు. కన్వీనర్ కోరినట్లు అన్ని ఏర్పాట్లు చేయాలని అడిషనల్ కలెక్టర్ ఆదేశించారు.

Similar News

News November 5, 2025

విజయనగరంలో 7న మెగా జాబ్ మేళా

image

APSSDC ఆధ్వర్యంలో ఈనెల 7న ఉదయం 9 గంటలకు విజయనగరం AGL డిగ్రీ కాలేజీ వద్ద మెగా జాబ్ మేళా నిర్వహించనున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంత కుమార్ తెలిపారు. 18-35 ఏళ్ల మధ్య వయసున్న నిరుద్యోగులు పాల్గొనవచ్చని అన్నారు. SSC, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, ఏదైనా పీజీలో ఉత్తీర్ణత సాధించాలన్నారు.
12 కంపెనీలు నియామకాలు చేపడతాయని, naipunyam.ap.gov.in లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.

News November 5, 2025

జగిత్యాల: సౌదీలో రాయికల్ వాసి మృతి

image

సౌదీ అరేబియాలోని జెడ్డాలో రాయికల్ పట్టణానికి చెందిన సుతారి ధర్మయ్య(50) మంగళవారం రాత్రి రోడ్డు దాటుతుండగా యాక్సిడెంట్ జరిగిందని సోషల్ మీడియా ద్వారా అక్కడి స్థానికులు తెలిపారు. దురదృష్టవశాత్తు మరణం సంభవించినట్లు దుబాయ్ వాసులు చెబుతున్నారు. అక్కడే ఉన్న మన తెలుగు వారు సౌదీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 5, 2025

సివిల్‌ సర్వీసెస్‌ ఉద్యోగుల క్రీడలు ఈ నెల 11 నుంచి ప్రారంభం

image

మొంథా తుఫాను కారణంగా వాయిదా పడిన ఆల్‌ఇండియా సివిల్‌ సర్వీసెస్‌ ఉద్యోగుల జిల్లాస్థాయి క్రీడా ఎంపిక పోటీలు ఈ నెల 11, 12, 13వ తేదీల్లో జరుగనున్నాయి. ఈ మేరకు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎంఎన్వీ రాజు తెలిపారు. కలెక్టర్‌ అనుమతితో క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ క్రీడలు నిర్వహిస్తామని చెప్పారు. నంద్యాలలో 11, 12న వివిధ క్రీడలు, కర్నూలులో 13న స్విమ్మింగ్‌ పోటీ ఉంటుందని తెలిపారు.