News February 21, 2025
జగిత్యాల : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కోసం వెబ్‌సైట్!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వెబ్ సైట్ తీసుకువచ్చింది. జగిత్యాల జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు ఇల్లు కోసం దరఖాస్తు చేసుకోగా.. లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేశారు. ప్రస్తుతం దరఖాస్తు ఏ స్థితిలో ఉందో తెలియక ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే వారంతా https:indirammaindlu.telangana.gov.inలో ఆధార్, ఫోన్ నంబర్ ద్వారా దరఖాస్తు వివరాలు తెలుసుకోవచ్చు. Share It.
Similar News
News April 19, 2026
HYD: పాలిటెక్నిక్‌కు ప్రిపేర్ అవుతున్నారా? ఫ్రీ క్లాసెస్

పాలిటెక్నిక్ ప్రిపేర్ అయ్యేవారికి కొండా లక్ష్మణ్ బాపూజీ యూనివర్సిటీ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో అనుభవం కలిగిన లెక్చరర్స్ బోధించే పాఠ్యాంశాలు విద్య ఛానల్‌లో సా.5-7 గంటల వరకు, నిపుణ ఛానల్‌లో రా.9-11 గంటల వరకు కోచింగ్ అందుబాటులోకి రానున్నట్లు TSAT సీఈవో వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.
News April 19, 2026
సంగారెడ్డి: మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు

మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయించనుంది. ఒక్కో బస్సు విలువ రూ. 36 లక్షలు కాగా, ప్రభుత్వం రూ. 30 లక్షలు గ్రాంటుగా అందిస్తుంది, మిగిలిన రూ. 6 లక్షలు సంఘం భరించాల్సి ఉంటుంది. మొదటి విడతలో మండలానికి ఒక సంఘం చొప్పున మొత్తం 25 సంఘాలకు ఈ అవకాశం కల్పించనున్నారు. దీనివల్ల మహిళా సంఘాలకు ఉపాధితో పాటు రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి.
News April 19, 2026
SRH బ్యాక్ బోన్.. కన్సిస్టెంట్ క్లాసెన్

ఐపీఎల్-2026లో SRH బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ కన్సిస్టెన్సీ చూపిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన 6 మ్యాచుల్లో వరుసగా 31(22), 52(35), 62(41), 39(33), 40(26), 59(39) పరుగులు చేశారు. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల లిస్టులో తొలి స్థానంలో(283) కొనసాగుతున్నారు. జట్టు త్వరగా వికెట్లు కోల్పోయినప్పుడల్లా ఆచితూచి ఆడుతూ, లూజ్ బాల్స్‌ను బౌండరీకి తరలిస్తూ బ్యాటింగ్ విభాగానికి వెన్నెముకలా నిలుస్తున్నారు.


