News February 5, 2025
జగిత్యాల: ఇకనుంచి ఆర్టీసీ కార్గో సేవలలో హోమ్ డెలివరీ

జగిత్యాల జిల్లాలో నేటి నుంచి టీజీ ఆర్టీసీ లాజిస్టిక్స్ కార్గో సేవలలో హోమ్ డెలివరీ చేయనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ లాజిస్టిక్స్ సిబ్బంది బస్టాండ్ నుంచి మార్కెట్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని సిబ్బంది సూచించారు. హోమ్ డెలివరీ కౌంటర్ డెలివరీ పార్సిళ్లు ఇతర రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉంటాయని తెలిపారు.
Similar News
News November 13, 2025
కృష్ణా: హత్య కేసులో ఏడుగురికి జీవిత ఖైదు

హత్య కేసులో ఏడుగురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ కృష్ణా జిల్లా సెషన్స్ జడ్జి గోపి సంచలన తీర్పు ఇచ్చారు. బందరు (M) బుద్దాలపాలెంకు చెందిన కాగిత రామ్మోహనరావు 2013 ఫిబ్రవరి 28న దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న శొంఠి పైడేశ్వరరావు, బొర్రా శ్రీనివాసరావు, బొర్రా స్వామికృష్ణ, కాగిత సోమయ్య, శొంఠి వీర వెంకటేశ్వరరావు, శొంఠి వీరాంజనేయులు, శొంఠి ముసలయ్యకు జీవిత ఖైదు విధించారు.
News November 13, 2025
ప్రకాశం: రోడ్డు ప్రమాదంలో అయ్యప్ప భక్తుడి మృతి

ప్రకాశం జిల్లా పామూరు మండలం ఇనిమెర్ల ఎస్సీ పాలెం వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ఆటో ఢీకొట్టింది. పామూరు పట్టణంలోని ఆకుల వీధికి చెందిన అయ్యప్ప మాల ధరించిన చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఆటోలో ఉన్న మరికొందరికి గాయాలైనట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News November 13, 2025
SSC ఫీజు గడువు NOV 20 వరకు పొడిగింపు

TG: టెన్త్ పరీక్షల ఫీజు గడువును నవంబర్ 20 వరకు పొడిగిస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. నవంబర్ 21 నుంచి 29 వరకు ₹50, డిసెంబర్ 2 నుంచి 11 వరకు ₹200, 15 నుంచి 29 వరకు ₹500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించవచ్చని తెలిపింది. రెగ్యులర్, ఫెయిల్ అభ్యర్థులు 2026 మార్చిలో జరిగే ఈ పరీక్షలకు ఫీజు చెల్లించాలంది. గడువు లోపు రూ.125 ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.


