News February 26, 2026
జగిత్యాల: ఇక ‘వాట్సప్’లోనే కరెంట్ ఫిర్యాదులు

TGNPDCL విద్యుత్ సమస్యల పరిష్కారానికి వాట్సప్ చాట్ అందుబాటులోకి వచ్చిందని జగిత్యాల SE బి.సుదర్శనం తెలిపారు. 7901628348 నంబర్ తో వినియోగదారుల ముంగిటకే విద్యుత్ సేవలు అని అన్నారు. వాట్సాప్‌లో ‘Hi’ అని మెసేజ్ పంపితే వెంటనే ‘హాయ్.. NPDCL కాల్ సెంటర్ కు స్వాగతం’ అనే సందేశంతో Register Complaint, Tracకే Complaint, Chat with Agent వస్తాయి. Register Complaint, వివరాలతో ఫిర్యాదు చేయవచ్చని కోరారు.
Similar News
News April 19, 2026
శ్రీకాకుళం: ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు గుడ్ న్యూస్

ప్రభుత్వం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో మార్కులు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. ఇంప్రూవ్మెంట్ కట్టుకునే వెసులు బాటును ఈ ఏడాది నుంచి ప్రారంభించింది. శ్రీకాకుళం జిల్లాలో ద్వితీయ సంవత్సరంలో 73 శాతం ఫలితాలు వచ్చాయి. 17,355 మంది పరీక్ష రాయిగా 12,684 ఉత్తీర్ణత సాధించారు. మే 21 నుంచి జూన్ 4 వరకు పరీక్షలు జరుగుతాయి. ఈనెల 27 లోపు ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
News April 19, 2026
దువ్వాడ-నిడదవోలు మధ్య 3, 4 రైల్వే లైన్లకు ఆమోదం

ప్రధాని మోదీ నేతృత్వంలో నిడదవోలు-దువ్వాడ మధ్య 3, 4వ రైల్వే లైన్ల ప్రాజెక్ట్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. 198 కి.మీ.ల ప్రాజెక్ట్‌కు రూ.9,889 కోట్లు ఖర్చు చేయనున్నారు. ప్రస్తుతం 130% ట్రాఫిక్‌తో రద్దీగా ఉన్న ఈ మార్గంలో కొత్త లైన్లతో రైల్వే ప్రయాణ సమయం తగ్గనుంది. గోదావరి నదిపై 4.3 కి.మీ.ల రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం కీలకం. విశాఖ పోర్ట్, గంగవరం పోర్ట్ కనెక్టివిటీ పెరిగి, సరకు రవాణా వేగవంతం కానుంది.
News April 19, 2026
జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో దినుసుల ధరలు

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో శనివారం పసుపు (పిల్ల కొమ్ము) క్వింటాల్ గరిష్ఠం ₹13,100, కనిష్ఠం ₹9,200, పసుపు (మండ కొమ్ము) గరిష్ఠం ₹11,500, కనిష్ఠం ₹9,055, మక్కలు గరిష్ఠం ₹1,950, కనిష్ఠం ₹1,765, కందులు ₹6,866, నువ్వులు ₹9,155, సోయాబీన్ ₹3,559, పొద్దుతిరుగుడు ₹3,059, జొన్నలు ₹4,559, శనగలు ₹4,200, వరి (1010) గరిష్ఠం ₹1,785, కనిష్ఠం ₹1,752, అనుములు ₹4,352గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు.


