News March 6, 2025
జగిత్యాల: ఈవీఎం గోదాం కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్న ఈవీఎం గోడౌన్‌ను ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ గురువారం తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రతకు సంబంధించి ప్రతి నెల తనిఖీలలో భాగంగా గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, ఆర్డిఓ మధుసూదన్, తాసిల్దార్ రామ్మోహన్ తదితరులు ఉన్నారు.
Similar News
News March 24, 2025
సాలూరు: పార్లమెంట్‌లో “అరకు కాఫీ స్టాల్’

పార్లమెంట్‌లో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా అరకు కాఫీ స్టాల్‌ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్‌కు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జుయల్ ఓరం, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
News March 24, 2025
బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కీలక పరిణామం

TG: బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. 19 మంది బెట్టింగ్ యాప్ ఓనర్లపై మియాపూర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ మేరకు కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో ఇటీవల కేసులు నమోదైన సెలబ్రిటీలను సాక్షులుగా మార్చాలనే యోచనలో పోలీసులు ఉన్నట్లు సమాచారం. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో 25 మంది సెలబ్రిటీలపై మియాపూర్ పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.
News March 24, 2025
అల్లూరి జిల్లాలో పిడుగుపాటుకు అవకాశం

అల్లూరి జిల్లాలో పలు ప్రాంతాల్లో సోమవారం మధ్యాహ్నం పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈదురు గాలులతో కూడిన వర్షంతో పాటు పిడుగులు పడే ఛాన్స్ ఉందని చెట్లు, పొలాల్లో, టవర్స్ కింద ఉండరాదని హెచ్చరించారు. పాడేరు, డుంబ్రిగుడ, హుకుంపేట, మాడుగుల, గంగవరం, గూడెం, అనంతగిరి, అరకు, చింతపల్లి మండలాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు.