News October 8, 2024
జగిత్యాల: ఉపాధి కల్పనకు కసరత్తు

ఉపాధిహామీ పథకం కింద గ్రామీణ కూలీలకు చేతినిండా పని కల్పించడానికి జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో చేపట్టాల్సిన పనులను గుర్తించారు. వచ్చే నెలలో మండలాల వారిగా ప్రణాళికలు ఖరారు చేయనున్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా 1.67 లక్షల జాబ్ కార్డుల పరిధిలో 2.73 లక్షల మంది కూలీలు ఉన్నారు.
Similar News
News November 2, 2025
కరీంనగర్ : ఈనెల 15న లోక్ అదాలత్

కరీంనగర్, హుజూరాబాద్ కోర్టుల పరిధిలో ఈనెల 15న లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. వెంకటేష్ తెలిపారు. లోక్ అదాలత్‌లో చెక్ బౌన్స్, క్రిమినల్, సివిల్, కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కక్షిదారులు తమ కేసులను రాజీ చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
News November 2, 2025
తిమ్మాపూర్: 41 ఏండ్ల సర్వీస్.. స్కూల్ అసిస్టెంట్‌కు ఘన సన్మానం

తిమ్మాపూర్ మండలం పొలంపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 41 ఏండ్ల 8 నెలల సుదీర్ఘ సేవలు అందించిన ఎస్ఏ (సోషల్) టి. రమేష్ కుమార్ దంపతులకు ఘన సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాధికారి వంగల శ్రీనివాస్, రమేష్ కుమార్ సేవలు ఆదర్శనీయమని ప్రశంసించారు. అనంతరం వారికి జ్ఞాపికలు అందజేసి, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు.
News November 2, 2025
KNR: ‘రివిజన్ ప్రక్రియను సమర్ధవంతంగా చేపట్టాలి’

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి అదనపు సీఈఓ లోకేశ్ కుమార్, ఇతర అధికారులతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ఈఆర్‌వోలతో రివిజన్ పురోగతిపై సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పాల్గొన్నారు.


