News February 10, 2025

జగిత్యాల: ఉరేసుకుని యువతి ఆత్మహత్య

image

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన సందవేని శ్రీవాణి(23) ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. మృతురాలు ధర్మారంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 26, 2025

SBI సరికొత్త రికార్డు.. షేర్ వాల్యూ@రూ.999

image

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు SBI సరికొత్త రికార్డు నమోదుచేసింది. ఇవాళ సంస్థ స్టాక్ దాదాపు 3 శాతం పెరగడంతో విలువ ఆల్‌టైమ్ హై రూ.999కి చేరింది. స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.1000 కూడా దాటొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా సంస్థ వ్యాపార విలువ రూ.100 లక్షల కోట్లకు చేరినట్లు ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

News November 26, 2025

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జగన్ సంతకం

image

రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతకం చేశారు. పులివెందుల పర్యటనలో ఉన్న ఆయన బుధవారం కోటి సంతకాల సేకరణ ఫారంపై సంతకం చేసి తన వ్యతిరేకతను తెలియజేశారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వైకాపా ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

News November 26, 2025

ప్రొద్దుటూరులో బంగారు ధరలు ఇలా..

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో బంగారు ధరలు బుధవారం ఇలా ఉన్నాయి.
* బంగారు 24 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.12,590
* బంగారు 22 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.11,583
* వెండి 10 గ్రాములు ధర రూ.1,630 గా ఉంది.
నిన్న, ఈరోజుకి బంగారు ధరలో ఎలాంటి మార్పు లేదు. కానీ నిన్న వెండి 10 గ్రాములు రూ.1,616 ఉండగా నేడు రూ.1630లకు పెరిగింది.