News February 10, 2025
జగిత్యాల: ఉరేసుకుని యువతి ఆత్మహత్య

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన సందవేని శ్రీవాణి(23) ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. మృతురాలు ధర్మారంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 9, 2026
NZB: సమస్యాత్మక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి: సీపీ

మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటుహక్కును వినియోగించుకునేలా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సీపీ సాయి చైతన్య సూచించారు. ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో సీపీ సోమవారం అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, పటిష్ట బందోబస్తు చేపట్టాలని ఆదేశించారు. అదనపు డీసీపీ(అడ్మిన్) బస్వారెడ్డి, ఏసీపీ ప్రకాశ్ పాల్గొన్నారు.
News February 9, 2026
వికారాబాద్ జిల్లాలో.. గప్ చుప్!

వికారాబాద్ జిల్లాలో మైకులు మొగబోయాయి. నేటి సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరబడింది. జిల్లా వ్యాప్తంగా నాలుగు మున్సిపాలిటయూ ఉన్నాయి. ఎల్లుండి నాలుగు మున్సిపాలిటీలలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. జిల్లావ్యాప్తంగా బార్లతో పాటు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి.
News February 9, 2026
MDK: ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం

ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సాయంత్రంతో తెర పడింది. ఉమ్మడి జిల్లాలో 409 వార్డులకు 1,486 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. గెలుపే ధ్యేయంగా పావులు కదుపుతున్న అభ్యర్థులు చివరి రోజు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం ముగించి ఇక సామాజిక ఓట్లపై దృష్టి కేంద్రీకరించారు.


