News March 6, 2025
జగిత్యాల: ఎక్కడి సమస్యలు అక్కడే..!

గ్రామాల్లో సర్పంచ్‌ల పదవీకాలం ముగిసి సంవత్సరం దాటింది. అప్పటి నుంచి జగిత్యాల జిల్లాలోని 385 గ్రామపంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. దీంతో గ్రామాల్లో సమస్యలు తిష్ఠవేశాయి. గ్రామపంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో ప్రభుత్వాలు నిధులు విడుదల చేయడం లేదు. ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
Similar News
News December 8, 2025
పట్టు బిగిస్తున్న కందుల దుర్గేశ్

నిడదవోలులో మంత్రి కందుల దుర్గేశ్ పట్టు బిగిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో నైనా సీటు త్యాగం చేసిన బూరుగుపల్లి శేషారావుకి మళ్లీ ఛాన్స్ ఇస్తారా? అన్నది సందేహంగానే ఉంది. ఇప్పటికే మున్సిపాలిటీలో జనసేన పాగా వేసింది. 6 పీఎసీఎస్, ఏఎంసీ, ఇతర నామినేటెడ్ పోస్టుల్లో జనసేన ఆధిపత్యం నడుస్తోంది. మంత్రి వ్యూహాత్మకంగా జనసేనను బలోపేతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శేషారావు రాజకీయ భవిష్యత్తు చర్చనీయాంశం అయింది.
News December 8, 2025
నాగర్‌కర్నూల్: 154 టీచర్, 974 ఆయా పోస్టులు ఖాళీలు

నాగర్ కర్నూల్ జిల్లాలో 154 అంగన్వాడీ టీచర్లు, 974 ఆయా పోస్టులు ఖాళీలు ఉన్నాయి. పోస్టులు భర్తీ చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించినట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి రాజేశ్వరి సోమవారం తెలిపారు. ఖాళీ పోస్టుల కారణంగా గ్రామాలలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ కష్టంగా మారిందన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు.
News December 8, 2025
ఇండిగో సంక్షోభం.. అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో

ఇండిగో విమానాల సంక్షోభంపై అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రభుత్వం ఇప్పటికే దీనిపై చర్యలు తీసుకుంటోందని తెలిపింది. ఈ సమయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అయితే ఇది తీవ్రమైన సమస్య అని, లక్షలాది మంది బాధితులు ఉన్నారని ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా విమానాల రద్దుపై ఈ పిల్ దాఖలైంది.


