News January 23, 2025
జగిత్యాల: ఎన్నిసార్లు దరఖాస్తు చేయాలంటూ ఆందోళన

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంట గ్రామంలో ప్రజాపాలన ప్రత్యేక గ్రామసభ గురువారం నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్లు పేదలకు ఇవ్వాలని.. జాబితాలో పేదల పేర్లు లేవంటూ గ్రామస్థులు అధికారులను నిలదీశారు. ఇంకెప్పుడూ పేదలకు ఇళ్లు మంజూరు చేస్తారని, ఎన్నిసార్లు దరఖాస్తు చేయాలని అధికారులపై గ్రామస్థులు మండిపడ్డారు. గ్రామ సభలో కాసేపు గందరగోళం నెలకొంది. అధికారుల సమాధానంపై గ్రామస్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
Similar News
News December 9, 2025
నేషనల్ కెమికల్ లాబోరేటరీలో ఉద్యోగాలు

పుణేలోని CSIR-నేషనల్ కెమికల్ లాబోరేటరీలో 34 టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 12 నుంచి జనవరి 12 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. టెక్నీషియన్‌కు నెలకు రూ.40వేలు, టెక్నికల్ అసిస్టెంట్‌కు రూ.72,000 చెల్లిస్తారు. వెబ్సైట్: http://recruit.ncl.res.in/
News December 9, 2025
చంద్రబాబు ఎప్పటికీ రైతు వ్యతిరేకే: పేర్ని నాని

AP: వ్యవసాయం, ధాన్యాగారంగా APకి ఉన్న బ్రాండును దెబ్బతీసింది CM చంద్రబాబేనని మాజీమంత్రి పేర్ని నాని విమర్శించారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రైతును గుడ్డికన్నుతో చూడటం చంద్రబాబు విధానం. ఆయన ఎప్పటికీ రైతు వ్యతిరేకే. అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారు. 18నెలల్లోనే రూ.2.66లక్షల కోట్ల అప్పుచేశారు. అప్పులు తెచ్చి ఎక్కడ పెడుతున్నారు? దేశ GDPలో AP వాటా ఎంత?’ అని ప్రశ్నించారు.
News December 9, 2025
ప్రకాశం డీఈవో కిరణ్ కుమార్ బదిలీ

ప్రకాశం జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన డీఈవోల సాధారణ బదిలీలలో ప్రకాశం జిల్లా డీఈవో కిరణ్ కుమార్ గుంటూరు జిల్లా బోయపాలెం డైట్ కళాశాలకు బదిలీ కాగా, ఆయన స్థానంలో గుంటూరు జిల్లా డీఈవో సీవీ రేణుక నియమితులయ్యారు. త్వరలోనే ప్రకాశం డీఈవోగా రేణుక బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం.


