News March 29, 2024
జగిత్యాల ఎమ్మెల్యేకు పితృ వియోగం

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తండ్రి, సీనియర్ న్యాయవాది మాకునూరి హన్మంతరావు కొద్దిసేపటి క్రితం మరణించారు. పార్థివదేహాన్ని హౌసింగ్ బోర్డు కాలనీలో గల ఎమ్మెల్యే గృహంలో ఉంచారు. కాగా, ఈరోజు రాత్రి 8 గంటలకు మోతే శ్మశానవాటిక(శంకర్ ఘాట్)లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను పలువురు ప్రముఖులు పరామర్శించారు.
Similar News
News April 22, 2025
KNR: పప్పు ధాన్యాల సాగుపై రైతుల అనాసక్తి!

ఉమ్మడి KNR జిల్లాలో పప్పు ధాన్యాల సాగు తగ్గిపోతుంది. మినప, పెసర, కంది, పల్లి, ఇతర పంటలను సాగు చేయడానికి రైతులు ఆసక్తి చూపడం లేదు. వేలాది ఎకరాల్లో సాగయ్యే పప్పు ధాన్యాల పంట నేడు గణనీయంగా తగ్గిపోయింది. యాసంగి సాగు తరువాత మినప, పెసర పంటలు వేయడం వల్ల భూసారం పెరగడంతో పాటు రైతులకు ఆదాయం కూడా వస్తుంది. అధికారులు చర్యలు తీసుకోని రైతులకు అవగాహన కల్పించాలి. లేదంటే ఈ పంటలు కనుమరుగు అయ్యే అవకాశాలు ఉన్నాయి.
News April 22, 2025
గుంపుల- తనుగుల వంతెన పై రోడ్డు ప్రమాదం యువకుడు మృతి

ఓదెల(M) గుంపుల, జమ్మికుంట(M) తనుగుల మధ్య ఉన్న వంతెనపై రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. JMKT(M) వావిలాలకు చెందిన నెల్లి వంశీ(25)కి ఓదెల(M) గూడెంకు చెందిన అర్చితతో ఇటీవల వివాహమైంది. కళ్యాణ లక్ష్మి పత్రాలపై సంతకం చేసేందుకు ఉదయం గూడెం గ్రామానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో గుంపుల వంతెన పై ఎదురుగా వస్తున్న కారు బైక్ ను ఢీ కొట్టింది. వంశీ మృతి చెందగా అర్చిత ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.
News April 21, 2025
కరీంనగర్: ధరణిలో పొరపాట్ల సవరణ అధికారం కలెక్టర్కే : పమేలా సత్పతి

ధరణిలో పొరపాట్లను సవరించడానికి కలెక్టర్ మినహా ఏ అధికారికి అవకాశం లేదని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. సోమవారం గంగాధరలోని ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో భూభారతి, ఆర్వోఆర్ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తహశీల్దార్ స్థాయిలో పరిష్కారమయ్యే చిన్న సమస్యలు వేలసంఖ్యలో పేరుకుపోయాయన్నారు. భూభారతి చట్టం ద్వారా ప్రభుత్వం అన్ని సమస్యలు పరిష్కరిస్తుందన్నారు.