News February 28, 2025
జగిత్యాల ఎమ్మెల్యే ఆదేశాలు

జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీ, నుకపల్లి కాలనీలో లబ్ధిదారులకు మంజూరైన డబల్ బెడ్ రూం ఇళ్లకు మౌలిక సదుపాయాలు డ్రైనేజీ లు, ట్రాన్స్ ఫార్మర్ లు, సెప్టిక్ ట్యాంక్, నీళ్ళ వసతి పనులు 10 రోజుల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆదేశించారు. ప్రజల సహకారంతో పట్టణం అభివృద్ధి చెందుతుందన్నారు.
Similar News
News February 28, 2025
విద్యార్థులకు మూడో భాష అక్కర్లేదు: స్టాలిన్

Ai కాలంలో విద్యార్థులకు మూడో భాష అక్కర్లేదని తమిళనాడు సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు. ‘ట్రాన్స్‌లేషన్ కోసం టెక్నాలజీ రావడంతో భాషకు అడ్డంకులు తొలగిపోయాయి. పిల్లలను అదనపు భాషతో ఇబ్బంది పెట్టొద్దు. వాళ్లు మదర్ టంగ్‌తో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీలో పట్టు కోసం ఇంగ్లిష్ నేర్చుకుంటే చాలు’ అని ట్వీట్ చేశారు. కాగా, NEPలో భాగంగా దేశవ్యాప్తంగా స్థానిక భాషతో పాటు హిందీ, ఇంగ్లిష్ తేవాలని కేంద్రం ప్రయత్నిస్తోంది.
News February 28, 2025
గోరంట్ల మాధవ్‌పై ఎస్పీకి ఫిర్యాదు

వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలపై టీడీపీ, జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వంలో అంతర్యుద్ధం మొదలైందని ఆయన చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా మాధవ్ వ్యవహరించారని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్‌కు ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.
News February 28, 2025
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఊసే లేదు: షర్మిల

AP: కూటమి ప్రభుత్వ తొలి బడ్జెట్ అంతా అంకెల గారడీ, అభూత కల్పన అని వైఎస్ షర్మిల విమర్శించారు. ‘ఇది పస లేని బడ్జెట్. రాష్ట్రం గుల్ల.. బడ్జెట్ అంతా డొల్ల. సూపర్ సిక్స్ పథకాలకు పంగనామాలు పెట్టారు. అన్నదాత సుఖీభవ పథకానికి రూ.11 వేల కోట్ల నిధులు కావాల్సి ఉంటే రూ.6300 కోట్లే కేటాయించారు. తల్లికి వందనం నిధుల్లో కోత పెట్టారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగ భృతి ఊసే లేదు’ అని మండిపడ్డారు.