News February 26, 2025
జగిత్యాల: ఎమ్మెల్సీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను పరిశీలించిన కలెక్టర్

జగిత్యాల పట్టణంలోని వివేకానంద మినీ స్టేడియంలో ఏర్పాటుచేసిన ఎమ్మెల్సీ ఎన్నికలు డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ను, ఏర్పాట్లను కలెక్టర్ సత్యప్రసాద్ బుధవారం పరిశీలించారు. రూట్ బస్సులను పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట ఎస్పీ అశోక్ కుమార్, ఆర్డీవోలు తదితర అధికారులు ఉన్నారు.
Similar News
News February 27, 2025
NZB: స్విమ్మింగ్ పూల్లో మునిగి యువకుడి దుర్మరణం

నిజామాబాద్ నగర శివారులోని సారంగాపూర్లో ఇటీవల ప్రారంభించిన స్విమ్మింగ్ పూల్లో ఈత నేర్చుకునేందుకు వెళ్లిన ఓ యువకుడు నీటిలో మునిగి మృతి చెందాడు. నిజాం కాలనీకి చెందిన సయ్యద్ ఆశ్రఫ్(22), అతని అన్నతో కలిసి స్విమ్మింగ్ ఫూల్లో ఈత కొట్టేందుకు వెళ్ళాడు. స్విమ్మింగ్ కోచ్ లేకపోయినా ఆశ్రఫ్ ట్యూబ్ ధరించకపోయినా అతడిని ఈత కొట్టేందుకు అనుమతించారు. దీంతో అతడు లోతుకు వెళ్లి నీటిలో మునిగి మృతి చెందాడు.
News February 27, 2025
19మంది డాక్టర్లను అందించిన చిన్న గ్రామం

అకోలి గ్రామ డాక్టర్లు, వారి తల్లిదండ్రుల అభినందన సభ, వయోవృద్ధులకు సన్మాన కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కమ్మల నర్సింలు మాట్లాడారు. తమ గ్రామం 90% అక్షరాస్యత సాధించిందని, ఆ ప్రభావం 19మంది డాక్టర్లు, 34మంది ఉద్యోగులను ఇచ్చిందన్నారు. పీజీ చేసినవారు 23 మంది ఉన్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, ఉదారి నారాయణ పాల్గొన్నారు.
News February 27, 2025
అంతర్జాతీయ సదస్సులో సిద్దిపేట ప్రొఫెసర్కు ప్రశంసా పత్రం

ఈనెల 24, 25న నేపాల్ రాజధాని కాట్మండ్లో బయోటెక్నాలజీ సొసైటీ ఆఫ్ నేపాల్ ఆధ్వర్యంలో జరిగిన మూడు రోజుల అంతర్జాతీయ సదస్సులో వివిధ దేశాల నుంచి పరిశోధకులు పరిశోధనా పత్రాలను ప్రవేశపెట్టారు. జంపన్న వాగు నీటి నాణ్యత పైన చేసిన పరిశోధన పత్రాన్ని ప్రవేశపెట్టిన సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల సూక్ష్మ జీవశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ మదన్ మోహన్కు అంతర్జాతీయ సదస్సులో ప్రశంస పత్రాన్ని అందజేశారు.