News February 26, 2025

జగిత్యాల: ఎమ్మెల్సీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను పరిశీలించిన కలెక్టర్

image

జగిత్యాల పట్టణంలోని వివేకానంద మినీ స్టేడియంలో ఏర్పాటుచేసిన ఎమ్మెల్సీ ఎన్నికలు డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్‌ను, ఏర్పాట్లను కలెక్టర్ సత్యప్రసాద్ బుధవారం పరిశీలించారు. రూట్ బస్సులను పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట ఎస్పీ అశోక్ కుమార్, ఆర్డీవోలు తదితర అధికారులు ఉన్నారు.

Similar News

News March 26, 2025

తలసరి ఆదాయంలో విశాఖ ఫస్ట్.. శ్రీకాకుళం లాస్ట్: సీఎం

image

AP: రాష్ట్రంలోని అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. తలసరి ఆదాయంలో విశాఖ రాష్ట్రంలోనే అగ్రస్థానంలో, శ్రీకాకుళం లాస్ట్ ప్లేస్‌లో ఉందని చెప్పారు. రాష్ట్ర సగటు కన్నా విశాఖ తలసరి ఆదాయం ఎక్కువని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన అనకాపల్లి, అల్లూరి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కలెక్టరేట్లతోపాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని వెల్లడించారు.

News March 26, 2025

నారాయణపేట POLITICS.. కాంగ్రెస్ ప్రక్షాళన..?

image

TG కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు. 18ఏళ్ల తర్వాత జిల్లా కాంగ్రెస్ కమిటీలతో రేపు ఢిల్లీలో మీటింగ్ పెట్టనున్నారు. ఇందులో జిల్లా, బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక ఉంటుందని టాక్. కాగా NRPT డీసీసీ చీఫ్‌గా ప్రశాంత్ కుమార్ రెడ్డి ఉన్నారు. అయితే ఈ పదవి కోసం పలువురు సీనియర్ నేతలు ఆశిస్తుండగా ప్రశాంత్‌నే మరోసారి కొనసాగిస్తారని సమాచారం.

News March 26, 2025

శ్రీకాకుళం: ‘కెమికల్ ఇంజనీర్లకు విపరీతమైన గిరాకీ’

image

శ్రీకాకుళం జిల్లాలో కెమిక‌ల్ ఇంజినీర్ల‌కు విప‌రీత‌మైన డిమాండు ఉంద‌ని శ్రీకాకుళం జిల్లా క‌లెక్ట‌రు స్వ‌ప్నిల్ దిన‌క‌ర్ పుండ్కర్ తెలిపారు. ఫార్మా రంగంలో జిల్లా వేగంగా అభివృద్ది చెందుతోందని చెప్పారు. అమరావతిలో బుధవారం సీఎం సమక్షంలో జరిగిన జిల్లా క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో ఆయ‌న త‌న జిల్లా ప్ర‌గ‌తి గురించి ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. జిల్లాలో ఫార్మా సంస్థ‌ల నుంచి డిమాండ్ అధికంగా ఉందన్నారు.

error: Content is protected !!